ఆక్సిజన్ కొరత లేకుండా చూడాల్సింది కేంద్రమే 

ఆక్సిజన్ కొరత లేకుండా చూడాల్సింది కేంద్రమే 

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నందున ఆక్సిజన్ సిలిండర్ల కొరత రాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. మెడికల్ ఆక్సిజన్ కొరత విషయంలో బాధ్యత ప్రభుత్వాలదేనని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై దిగ్విజయ్ మండిపడ్డారు. మెడికల్ ఆక్సిజన్ డిమాండ్‌‌ను నియంత్రణలో ఉంచాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్లదేనని పీయూష్ అనడం సరికాదన్నారు. ఆక్సిజన్ డిమాండ్ అనేది అవసరాన్ని బట్టి పెరగడం లేదా తగ్గడం అనేది ఆధారపడుతుందని.. దీన్ని ఎలా కంట్రోల్ చేయగలమని డిగ్గీ రాజా ప్రశ్నించారు. కరోనా ట్రీట్‌‌మెంట్‌‌లో ఆక్సిజన్ సప్లయ్ చాలా ముఖ్యమని మొదటి నుంచి డాక్టర్లు మొత్తుకుంటున్నారని గుర్తు చేశారు. ఎమర్జెన్సీకి తగ్గట్లుగా సదుపాయాల ఏర్పాటులో కేంద్రం విఫలమైందని దుయ్యబట్టారు. కరోనాను ఎదుర్కోవడంలో మోడీ సర్కార్ అన్ని విధాలుగా ఫెయిల్ అయ్యిందన్నారు.