ఎస్సై ప్రిలిమినరీ ఎగ్జామ్ కు 2,25,759 మంది హాజరు

ఎస్సై ప్రిలిమినరీ ఎగ్జామ్ కు 2,25,759 మంది హాజరు

రాష్ట్రవ్యాప్తంగా SI ప్రిలిమినరీ ఎగ్జామ్ ముగిసింది. హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాల్లోని మొత్తం 538 సెంటర్లలో పరీక్ష నిర్వహించారు.  554 పోస్టులకుగానూ 2,25,759 మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాశారు. 10 గంటల నుంచి ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది. ఉదయం 10 గంటల తర్వాత ఒక్క నిమిషం లేటైనా అధికారులు అభ్యర్థులను ఎగ్జామ్ సెంటర్లలోకి అనుమతించలేదు.

నాగోల్ లోని శ్రీయాస్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎగ్జామ్ కు లేట్ వచ్చిన ముగ్గురిని అనుమతించలేదు. ఇటు సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ డిగ్రీ కాలేజ్ దగ్గర ఓ అభ్యర్ధి పాస్ పోర్ట్ సైజ్ ఫోటో  తీసుకురానందుకు  లోపలికి పంపించలేదు. మెదక్ జిల్లా ఎగ్జామ్ సెంటర్ కు ఆలస్యంగా వచ్చిన నలుగురు అభ్యర్ధులు తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. సిద్దిపేటలో కూడా లేట్ గా వచ్చిన యువకున్ని అధికారులు అనుమతించలేదు. కొంత మంది అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్లు దొరకక ఇబ్బందులు పడ్డారు. సెంటర్ తెలుసుకొని వెళ్లేలోపు సమయం అయిపోవడంతో అధికారులు గేట్లు మూసివేశారు. దీంతో ఎగ్జామ్ మిస్ అయ్యామని విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేశారు.