పేదల ఆరోగ్యానికి భరోసా సీఎంఆర్ఎఫ్ : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

పేదల ఆరోగ్యానికి భరోసా సీఎంఆర్ఎఫ్ : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

ధర్మసాగర్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని, పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్​ భరోసానిస్తుందని స్టేషన్​ఘన్​పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం ధర్మసాగర్ మండలం నారాయణగిరికి చెందిన చుంచు సతీశ్​కు రూ.3.50 లక్షలు, చుంచు శ్రీలతకు రూ.2.50 లక్షల విలువైన ఎల్​వోసీ చెక్కులు మంజూరు కాగా, ఎమ్మెల్యే హనుమకొండ నివాసంలో వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పుట్ట రేణుక కుమార్, సీనియర్ నాయకులు రామ్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.