గణేష్ విగ్రహం తరలిస్తుండగా కరెంట్ షాక్..ఇద్దరు యువకులు మృతి

గణేష్ విగ్రహం తరలిస్తుండగా కరెంట్ షాక్..ఇద్దరు యువకులు మృతి

గుజరాత్ : వినాయక చవితి దగ్గరపడుతుంది. దేశవ్యాప్తంగా యువత డెకరేషన్లు చేస్తూ, విగ్రహాలను మండపాలకు తరలిస్తూ ఫుల్ జోష్ మీదున్నారు. అయితే వినాయకుడి విగ్రహాన్ని తరలించే సమయంలో గుజరాత్ లో అపశృతి చోటుచేసుకుంది. విగ్రహానికి కరెంట్ తీగలు అడ్డు రావడంతో వాటిని తప్పించే క్రమంలో షాక్ తగిలి, ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

అంతకుముందు ఆ ప్రాంతంలో వర్షం వచ్చినట్లు తెలుస్తుంది. కరెంట్ షాక్ తో  ఐదుగురు స్పృహలేకుండా పడిపోగా..వెంటనే తోటి ఫ్రెండ్స్ గుండెపై గట్టిగా కొట్టడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఇద్దరు మాత్రం అప్పటికే చనిపోయారు. గాయపడ్డవారిని హస్పిటల్ కి తరలించారు. వెంటనే విద్యుత్ సిబ్బంది వచ్చి కరెంట్ ను నిలిపివేశారు. మృతుల వివరాలు సేకరించామని.. ఇలాంటి సంఘటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పోలీసులు. విద్యుత్ ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది.