పోరాట అగ్ని కణం దొడ్డి కొమురయ్య

పోరాట అగ్ని కణం దొడ్డి కొమురయ్య

బచ్చన్నపేట, వెలుగు: తెలంగాణ సాయుధ పోరాట తొలి అగ్ని కణం దొడ్డి కొమురయ్య అని ప్రభుత్వ విప్,​ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి అన్నారు. ఆదివారం వారు జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం చిన్నరామచర్లలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తితోనే జనగామ ప్రాంతంలో లక్షలాది ఎకరాల భూమికి విముక్తి లభించిందన్నారు.

 నిరంకుశానికి ఎదురొడ్డి పోరాడిన అమరుడు కొమురయ్య చూపిన మార్గం తెలంగాణ పోరాట తత్వానికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో గ్రామ కురుమ సంఘం నాయకులు కేకే రాజు, ఎగ్గె మల్లేశం, చేవెళ్ల సంపత్, జిల్లా కాంగ్రెస్​నాయకులు కొమ్మూరి ప్రశాంత్​రెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్​నాయకురాలు పిన్నింటి కావ్యశ్రీ, పలు పార్టీల నాయకులు బేజాటి బీరప్ప, సీహెచ్​ రాజారెడ్డి, మేకల రాజు తదితరులు పాల్గొన్నారు.