
హైదరాబాద్, వెలుగు: సీటింగ్ సొల్యూషన్స్ ప్రొవైడర్ స్టీల్‌కేస్, ఫర్నిచర్ సెల్లర్ సీటింగ్ వరల్డ్‌తో కలిసి హైదరాబాద్‌లో తన ఫ్లాగ్‌షిప్ డీలర్ షోరూమ్‌ను ప్రారంభించింది. ఇది వరకే బెంగళూరు, ముంబై, ఢిల్లీ, టోక్యో, షాంఘై, బీజింగ్, హాంకాంగ్, సింగపూర్ సిడ్నీలలో తమకు షోరూమ్‌లు ఉన్నాయని సంస్థ తెలిపింది. ఈ షోరూమ్‌ను 10 వేల చదరపు అడుగుల్లో నాలుగు అంతస్తుల్లో ఏర్పాటు చేశారు. ఆఫీస్ సీటింగ్ ఫర్నీచర్‌తో పాటు ప్రపంచ ప్రసిద్ధ డిజైనర్లు ఆరెంజ్‌బాక్స్, వికార్బే, సెగిస్, ఎం.ఏ.డీ. గ్రాడోల ప్రొడక్టులూ ఇక్కడ దొరుకుతాయి. షోరూమ్ ఓపెనింగ్ కోసం ప్రత్యేకంగా హైదరాబాద్‌కు వచ్చిన స్టీల్‌కేస్ ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ ఉలి గ్విన్నర్ మీడియాతో మాట్లాడుతూ ‘‘మాకు పుణే దగ్గర్లలోని చకన్లో ప్లాంటు ఉంది. ఇండియా షోరూమ్‌లకు అవసరమైన ఫర్నిచర్‌ను అక్కడే తయారు చేస్తున్నాం. కొన్నింటిని విదేశాల నుంచి తెప్పిస్తున్నాం. ఇండియాలో మాకు 17 డీలర్ షోరూమ్‌లు ఉన్నాయి. మేం ఏటా రెండంకెల గ్రోత్ సాధిస్తున్నాం. మొత్తం మూడు వేలకుపైగా ప్రొడక్టులను అమ్ముతున్నాం. వర్క్‌ఫ్రం హోం కోసం అద్భుతమైన కుర్చీలు, టేబుల్స్ తయారు చేశాం”అని ఆయన వివరించారు. అమెరికా నగరం మిచిగాన్‌లోని గ్రాండ్ ర్యాపిడ్స్‌లో ఏర్పాటైన తమ సంస్థ 2023 ఆర్థిక సంవత్సరంలో 3.2 బిలియన్ డాలర్ల ఆదాయం సంపాదించిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా తమకు 12,000 మంది ఉద్యోగులు, డీలర్లు ఉన్నారని గ్విన్నర్ వివరించారు.