ఏపీలో దశలవారీగా మద్యపాన నిషేధం అమలుకానుందా..!

ఏపీలో దశలవారీగా మద్యపాన నిషేధం అమలుకానుందా..!

సీఎంగా గెలిచినప్పట్నుంచే లిక్కర్ బ్యాన్ పై ఫొకస్ పెట్టిన జగన్.. కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుమ్మట్లు సమాచారం. ఈ క్రమంలోనే లిక్కర్ రేట్స్ పెంచారు. వైన్ షాపుల టైమింగ్స్ ను తగ్గించారు. ఇప్పటికే ప్రైవేటు వైన్ షాపులు, 40 శాతం బార్లను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ప్రైవేటు వైన్ షాపుల స్థానంలో సర్కారే మద్యం దుకాణాలను తెరిచింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే మద్యం అమ్మకాలను కుదించింది. రెండు విడతల్లో 60 నుంచి 70 శాతం మేర భారీగా మద్యం రేట్లు కూడా పెంచింది. అయితే మద్యపాన నిషేధం పూర్తిస్థాయిలో అమలుపర్చాలంటే మాత్రం కేరళలో మాదిరిగా లిక్కర్ కార్డులను ప్రవేశపెట్టాలి. ఏపీ సర్కార్ రానున్న ముడేళ్ళల్లో లిక్కర్ కార్డులను కూడా ప్రవేశపెట్టే ఆలోచలలో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. అది ఎంతవరకు అమల్లోకి వస్తుందో వేచిచూడాల్సిందే.

కేరళలో సక్సెస్

లిక్కర్ కార్డులు ప్రవేశపెట్టిన కేరళతో పాటు కొన్ని ప్రదేశాల్లో మంచి స్పందన వచ్చింది. ఏపీలోనూ లిక్కర్ కార్డులు తీసుకువస్తే ఆరోగ్య రీత్యా తప్పనిసరిగా వైన్ తాగాలనుకునేవారు కార్డు ఉపయోగిస్తారు.