
నేటి నుంచి దసరా సెలవులు కావడంతో పట్టణాల్లో చదువుకునే విద్యార్థులు సొంతూళ్ల బాట పట్టారు. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు స్కూళ్లకు హాలిడేస్ ఇవ్వడంతో బస్టాండ్ లు రద్దీగా మారాయి. సూర్యాపేట బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు బస్సుల్లో సీట్ల కోసం ఎగబడ్డారు. - సూర్యాపేట, వెలుగు