
గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్యూనియన్ ఎన్నికల్లో ఏబీవీపీ విజయం సాధించింది. ప్రెసిడెంట్‌గా ఏబీవీపీ అభ్యర్థి శివ పాలెపు ఎన్నికయ్యాడు. శనివారం జరిగిన ఓట్ల లెక్కింపులో యానియన్ అన్నీ పోస్టులను ఏబీవీపీ క్లీన్‌స్వీప్ చేసింది.
ఏబీవీపీ కూటమి అభ్యర్థులు దేబెంద్ర వైస్ ప్రెసిడెంట్‌గా, శ్రుతి ప్రియ ప్రధాన కార్యదర్శిగా, సౌరబ్ శుక్లా జాయింట్ సెక్రటరీగా, వీనస్ కల్చరల్ సెక్రటరీగా, జ్వాలా స్పోర్ట్స్ సెక్రటరీగా విజయం సాధించారు. దీంతో వర్సిటీ ప్రధాన గేట్ వద్ద ఏబీవీపీ నేతలు సంబురాలు చేసుకున్నారు.