ఆధార్ - పాన్ కార్డు లింక్ అయ్యిందో లేదో.. ఇలా తెలుసుకోండి..

ఆధార్ - పాన్ కార్డు లింక్ అయ్యిందో లేదో.. ఇలా తెలుసుకోండి..

భారతదేశంలో పన్ను చెల్లింపుదారులందరికీ ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేయాలని ఆదాయ పన్ను శాఖ ఈ నెల జూన్ 30వరకు గడువు విధించింది. ఇంతకుమునుపు ఇది మార్చి 31 చివరి తేదీగా ఉండగా.. ఇటీవలే ఈ సమయాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వెయ్యి రూపాయల ఫైన్ తో ఆధార్ ను, పాన్ ను లింక్ చేయాలని, ఈ గడువు దాటిపోతే అపరాధ రుసుముతో దరఖాస్తులు సమర్పించాలని చెప్పింది. గడువు సమీపిస్తోన్న క్రమంలో ఆధార ను పాన్ తో ఎలా లింక్ చేయాలో తెలుసుకోవడం, అసలు ఆధార్ ను పాన్ కు లింక్ చేశామా లేదా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఆధార్ కు పాన్ లింక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే..

  • ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
  • వెబ్ సైట్ లో క్విక్ లింక్ సెక్షన్ లో ఉన్న ఆధార్ స్టేటస్ ఆప్షన్ ను ఎంచుకోండి.
  • వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • సర్వీస్ పై పాన్ ఆధార్ స్టేటస్ కనిపిస్తుంది.

మీ ఆధార్ ను పాన్ కు లింక్ చేసినట్టయితే లింక్ చేయబడిందని, ఒకవేళ చేయకపోతే చేయలేదని చూపిస్తుంది.

ఆధార్ పాన్ కార్డ్ లింక్ స్టేటస్ ను ఎస్ఎంఎస్ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలంటే..

  • మీ ఫోన్ లో మెసేజింగ్ యాప్ ఓపెన్ చేయండి.
  • UIDPAN అని టైప్ చేసి <12 అంకెల ఆధార్ నంబర్ >10 అంకెల పాన్ నంబర్ ను టైప్ చేయండి.
  • పైన టైప్ చేసిన మెసేజ్ ను 56161 లేదా 567678కి సెండ్ చేయండి.

ఈ స్టెప్స్ తర్వాత మీ ఆధార్- పాన్ లింక్ స్టేటస్ కు సంబంధించిన అప్ డేట్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఎస్ఎంఎస్ వస్తుంది.