
రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఐదేళ్ల క్రితం వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’కి ఇది సీక్వెల్. సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నాడు. ఆగస్టు 15న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. ఫస్ట్ సాంగ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ‘స్టెప్పామార్’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను జులై 1న, ప్రొమోను శనివారం రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో శివుడి విగ్రహం ముందు డిఫరెంట్ కాస్ట్యూమ్స్‌తో స్టైలిష్ గెటప్‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు రామ్. ఫస్ట్ పార్ట్‌కి చార్ట్-బస్టర్ ఆల్బమ్ అందించిన మణిశర్మ మరోసారి మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్నారు. కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అలీ, గెటప్ శ్రీను ఇతర పాత్రలు పోషిస్తున్నారు. పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.