పత్తి విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి

పత్తి విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి

నేరడిగొండ, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలోని పత్తి రైతుల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్ రాష్ట్ర సీఎస్ శాంతి కుమారిని కోరారు. హైదరాబాద్​లోని సెక్రటేరియట్​లో బుధవారం సీఎస్​ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. అదిలాబాద్ జిల్లాలో విత్తనాల కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యేలు వివరించారు. జిల్లాలో ప్రధాన పంటగా సాగు చేస్తున్న పత్తి విత్తనాల కొరత లేకుండా చూడాలని, రైతులు మొగ్గు చూపుతున్న రాశి 659 సీడ్స్ అందుబాటులో ఉంచాలని కోరారు. ఏకకాలంలో 2 లక్షల 50 వేల పత్తి విత్తన బ్యాగులను  జిల్లాకు సరఫరా అయ్యేలా చూడాలని కోరారు.