
వికారాబాద్, వెలుగు: ప్రభుత్వ, ప్రైవేట్డైట్ కళాశాలల్లో మిగిలిపోయిన డీఇఎల్ఈడీ, డీపీఎస్ఈ సీట్లు, ఇటీవల ఈడబ్ల్యూఎస్ కోటా కింద మంజూరైన సీట్ల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు వికారాబాద్ డైట్కాలేజీ ప్రిన్సిపాల్ కె.రామాచారి ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో సర్టిఫికెట్వెరిఫికేషన్కు రానివారు 3 నుంచి 5వ తేదీ వరకు వికారాబాద్‌లోని ప్రభుత్వ డైట్ కళాశాలలో అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్అభ్యర్థులు ఇటీవల జారీ చేసిన సర్టిఫికెట్తీసుకురావాలని సూచించారు.
స్లైడింగ్కోరుకునేవారు, గతంలో సీటు రాని వారు, సీటు పొందినా కాలేజీలో చేరనివారు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఈ నెల 6, 7వ తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలన్నారు. రిజర్వేషన్, మెరిట్ ప్రకారం 11న సీట్లు భర్తీ చేస్తామని తెలిపారు. సీటు అలాట్అయినవారు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో 12న సంబంధిత కళాశాలల్లో రిపోర్టు చేయాలని పేర్కొన్నారు. స్లైడింగ్ విధానంలో సీటు పొందిన అభ్యర్థులు గతంలో ప్రవేశం పొందిన కళాశాల నుంచి రిలీవింగ్ లెటర్, ఒరిజనల్ సర్టిఫికెట్లను కొత్తగా సీటు వచ్చిన కళాశాలలో అందించాలన్నారు. ఇతర వివరాలకు 77807 40880, 70971 25608 ఫోన్‌నంబర్లలో సంప్రదించాలని సూచించారు.