స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్ ఐపీవో

స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్ ఐపీవో
  • రూ.4500కోట్ల షేర్లు అమ్మనున్న ప్రమోటర్లు
  • రూ. 4,500 కోట్లకు ఐపీఓ
  • సెబీ వద్ద ప్రాస్పె క్టస్‌‌ దాఖలు

ముంబై : షాపుర్జీ పల్లోంజి గ్రూప్‌‌లో ని స్టెర్లింగ్‌‌ అండ్‌‌ విల్సన్‌‌ సోలార్‌‌ లిమిటెడ్‌‌ రూ. 4,500 కోట్లకు ఇనీషియల్‌ పబ్లిక్‌‌ ఆఫరింగ్‌‌ (ఐపీఓ) చేయనుంది. సెక్యూరిటీస్‌ అండ్‌‌ ఎక్స్చేంజ్‌ బోర్డ్‌‌ ఆఫ్‌ ఇండియా (సెబీ)అనుమతి కోసం ప్రాస్పెక్టస్‌ ను దాఖలు చేసినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఐపీఓ కిం ద ప్రమోటర్లురూ. 4,500 కోట్ల విలువైన తమ షేర్లను అమ్మనున్నారు. ఐపీఓ పూర్తి ఆఫర్‌‌ ఫర్‌‌ సేల్‌ మాత్రమేనని, ప్రమోటర్లు ఖుర్షీద్‌‌ యాజ్ది దారువాల, షాపుర్జీ పల్లోంజి అండ్‌‌ కో ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌లు తమ షేర్లను విక్రయించనున్నాయని కంపెనీ పేర్కొంది. స్టెర్లింగ్‌‌ అండ్‌‌ విల్సన్‌‌ సోలార్‌‌ లిమిటెడ్‌‌లో ఛైర్మన్‌‌ దారువాలకు కంపెనీలో 33.33 శాతం, షాపుర్జీ పల్లోం జి అండ్‌‌ కోకు 65.77 శాతం వాటా ఉన్నాయి. మిగిలిన వాటాలు ప్రమోటర్‌‌ గ్రూప్‌‌ సైరస్‌ మిస్త్రీ కుటుంబంలోని ఇతర వ్యక్తుల చేతిలోను ఉన్నాయి.

అప్పులు తగ్గించుకునేందుకే….

సోలార్‌‌ ఈపీసీ వ్యాపారంలో ఉన్న స్టెర్లింగ్‌‌ అండ్‌‌ విల్సన్  ఈ ఐపీఓ కోసం గత కొన్ని నెలలుగా కసరత్తు చేస్తోంది. బయటి ఇన్వెస్టర్లను తీసుకు రావడం ద్వారారూ. 7000 కోట్లు (బిలియన్‌‌ డాలర్లు) సేకరించాలని,దాంతో గ్రూప్‌‌ అప్పులను తగ్గించుకోవాలని షాపుర్జీపల్లోం జి భావిస్తోంది. యురేకా ఫోర్బ్స్‌‌ లిమిటెడ్‌‌ను ప్రత్యేక కంపెనీగా లిస్ట్‌‌ చేయడం, కమర్షియల్‌ రియల్‌ఎస్టేట్‌‌ అమ్మకం వంటి చర్యలను కూడా గ్రూప్‌‌ తీసుకోవాలనుకుంటున్నట్లు గతంలోనే ఎగ్జిక్యూటివ్‌‌ డైరెక్టర్‌‌ జై మవానీ వెల్లడిం చారు.

అతి పెద్ద సోలార్‌ ఈపీసీలలో ఒకటి..

ప్రపంచంలోని అతి పెద్ద సోలార్‌‌ ఈపీసీ కంపెనీలలో స్టెర్లింగ్‌‌ అండ్‌‌ విల్సన్‌‌ కూడా ఒకటిగా పేరొందింది.స్టెర్లింగ్‌‌ అండ్‌‌ విల్సన్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌లో ఒక డివిజన్‌‌గా 2011 లో ఇది మొదలైంది. ఆ తర్వాత 2017లోదానిని ప్రత్యేక కంపెనీగా డీమెర్జర్‌‌ చేశారు. ప్రాజెక్ట్‌‌ డిజైన్‌‌, ఇంజినీరింగ్ నుంచి ఎగ్జిక్యూషన్‌‌ దాకా సోలార్‌‌ ప్రాజెక్టులలోని అన్ని కార్యకలాపాలను ఈ కంపెనీ చేపడుతుంది. ఆపరేషన్స్‌ అండ్‌‌ మెయింట్‌‌నెన్స్‌ సేవలనూ అందిస్తోంది. 6062 మెగావాట్ల కెపాసిటీఉన్న 183 సోలార్‌‌ ప్రాజెక్ టులను స్టెర్లిం గ్ అండ్‌‌ విల్సన్‌‌ సోలార్‌‌ అమలు చేసింది. కిం దటేడాది అబుదాబి నుంచి 1177 మెగావాట్ల సింగి ల్‌ ఆర్డరునూఈ కంపెనీ చేజిక్కించుకోవడం విశేషం.

డిసెంబర్‌‌ 2018 నాటికి ఆర్డర్ బుక్‌‌ విలువ రూ. 4,039 కోట్లు. 2017–18 ఆర్ధిక సంవత్సరంలో రూ. 6,872 కోట్ల ఆదాయం మీద కంపెనీ రూ. 451 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇక డిసెంబర్.‌ 2018 దాక. . 9 నెలల కాలానికి రూ. 5,915 కోట్ల ఆదాయం సంపాదించింది. స్టెర్లింగ్‌‌ అండ్‌‌ విల్సన్‌‌ మొత్తం 25 దేశాలకు కార్యకలాపాలను విస్తరించింది. కంపెనీ ఆదాయంలోఒక్క ఎగుమతుల ద్వారానే 65.13 శాతం లభిస్తోంది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ , యాక్సిస్‌ కాపిటల్‌ , క్రెడిట్‌‌ సూయైజ్‌ , డాయిష్‌‌ ఈక్విటీస్‌ , ఐఐఎఫ్‌ ఎల్‌ , ఎస్‌ బీఐకాపి టల్‌ మార్కెట్స్‌ ఈ ఐపీఓను నిర్వహిస్తున్నాయి.