ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచరీతో దుమ్ములేపాడు. యాషెస్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో అజేయ సెంచరీతో టెస్టుల్లో తన 37వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ మూడో రోజు ఆటలో (129*) ఆస్ట్రేలియాను ముందుకు తీసుకెళ్తున్నాడు. స్మిత్ ఇన్నింగ్స్ లో 15ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఈ ఆసీస్ బ్యాటర్ కు టెస్ట్ కెరీర్ లో ఇది 37వ శతకం. 36 సెంచరీలతో సునీల్ గవాస్కర్, బ్రియాన్ లారా, యూనిస్ ఖాన్, జయవర్ధనే లాంటి దిగ్గజాలను వెనక్కి నెట్టిన స్మిత్.. తాజా సెంచరీతో టీమిండియా మాజీ క్రికెటర్ మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ (36)ను అధిగమించాడు.
టెస్ట్ క్రికెట్ లో ఆస్ట్రేలియా తరపున అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడు స్మిత్. 41 సెంచరీలతో పాంటింగ్ తొలి స్థానంలో ఉన్నాడు. ఓవరాల్ గా అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల లిస్టులో ఆరో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో 51 సెంచరీలతో క్రికెట్ దిగ్గజం సచిన్ ఉన్నాడు. ప్రస్తుత టెస్ట్ క్రికెట్ లో రూట్ 41 టెస్ట్ సెంచరీలతో స్మిత్ కంటే ముందున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఇండియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో స్మిత్ రెండు సెంచరీలు బాది ఫామ్ లోకి వచ్చాడు. ఆ తర్వాత శ్రీలంకపై అదే ఫామ్ ను కొనసాగించి రెండు సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు.
Also Read : డబుల్ సెంచరీతో తెలుగు క్రికెటర్ సంచలనం
ప్రస్తుతం జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 518 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో ప్రస్తుతం ఆస్ట్రేలియా 134 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజ్ లో స్మిత్ (129), వెబ్ స్టర్ (42) ఉన్నారు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 163 పరుగులు చేసి ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించాడు. అంతక ముందు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 384 పరుగులకు ఆలౌటైంది. రూట్ 160 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. హ్యారీ బ్రూక్ (84), జెమీ స్మిత్ (46), విల్ జాక్స్ (27) కూడా రాణించగా.. కెప్టెన్ బెన్ స్టోక్స్ (0), బ్రైడన్ కార్స్ (1) ఫెయిలయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మైకేల్ నెసర్ 4 వికెట్లతో ఆకట్టుకున్నాడు.
More #Ashes history for Steve Smith, who brings up another stunning SCG hundred 👏#MilestoneMoment | @nrmainsurance pic.twitter.com/w76y8wGbWy
— cricket.com.au (@cricketcomau) January 6, 2026
