డబ్ల్యూటీసీ ఫైనల్‌ .. స్టీవ్ స్మిత్ సెంచరీ

డబ్ల్యూటీసీ ఫైనల్‌ ..   స్టీవ్ స్మిత్ సెంచరీ


టీమ్‌ఇండియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్   స్టీవ్ స్మిత్ (106*) సెంచరీ బాదాడు.  స్మిత్ ఇన్సింగ్స్ లో 17 ఫోర్లు ఉన్నాయి.  స్మిత్ కు ఇది 31 వ సెంచరీ కాగా ఇండియాపై 9 వ సెంచరీ కావడం విశేషం. ఇండియాపై అత్యధిక సెంచరీలు చేసిన రూట్ సెంచరీలను స్మిత్  సమం చేశాడు.  

అంతేకాకుండా  టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన మూడో క్రికెటర్ స్టీవ్ స్మిత్. అంతకంటే ముందు పాటింగ్ (41), స్టీవ్ వా (32) సెంచరీలతో ముందు వరుసలో ఉన్నారు. స్మిత్‌ ఓవల్‌లో ఆరు ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు చేశాడు. ఇంగ్లండ్‌లోని ఒకే వేదికపై బ్రాడ్‌మాన్ మాత్రమే ఎక్కువ సెంచరీలు సాధించాడు స్మిత్.  

ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఓవర్‌ నైట్ 327/3 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ కు బిగినింగ్ లోనే బిగ్ షాక్ తగిలింది.  ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన ట్రావిస్‌ హెడ్ (163)ను సిరాజ్‌ ఔట్ చేశాడు.  దీంతో  361 పరుగుల వద్ద ఆసీస్‌ నాలుగో వికెట్‌ను కోల్పోయింది.  స్మిత్‌తో కలిసి హెడ్‌ 285 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.  ప్రస్తుతం క్రీజ్ లో  స్మిత్(111), గ్రీన్ (6) పరుగులతో ఉన్నారు.