ఏడుపు ఒక్కటే తక్కువ: స్టాక్ మార్కెట్ దారుణంగా పడింది

ఏడుపు ఒక్కటే తక్కువ: స్టాక్ మార్కెట్ దారుణంగా పడింది

స్టాక్ మార్కెట్లు బుధవారం (జనవరి 17) భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1628 పాయింట్ల భారీ నష్టం చవిచూడగా..నిఫ్టీ 460 పాయింట్ల నష్టంతో ముగిసింది.  

సెన్సెక్స్ ప్యాక్ నుంచి టెక్ మహీంద్రా, హెచ్ సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, నెస్లే ఇండియా లాభాల్లో ఉండగా.. హెచ్ ఎఫ్ సీ బ్యాంక్, టాటా స్టీల్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వెనకబడి ఉన్నాయి. నిఫ్టీ ప్యాక్ నుంచి అపోలో హాస్పిటల్, హెచ్ సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఎస్ బీఐ లైఫ్, ఎల్ టీఐఎమ్ లాభపడగా.. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, టాటా స్టీల్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హిందాల్లో నష్ట పోయాయి.

బుధవారం ఉదయం 1073 పాయింట్ల నష్టంతో 72వేల 055 వద్ద సెన్సెక్స్, 198 పాయింట్ల నష్టంతో 21వేల 799 వద్ద నిఫ్టీ ప్రారంభమయ్యాయి. ఉదయం సెషన్ లో నిఫ్టీ వ్యాంక్ 1,180 పాయింట్లు క్షీణించి 46వేల 944 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.