నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 251 పాయింట్లు డౌన్.. 24,032 స్థాయి వద్ద నిఫ్టీ..

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 251 పాయింట్లు డౌన్.. 24,032 స్థాయి వద్ద నిఫ్టీ..

ఈ వారంలో రెండో రోజు మంగళవారం(5 మే 2026)న భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఉదయం ప్రారంభం నుండే బలహీనంగా ఉన్న స్టాక్ మార్కెట్లు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు  ఇతర ఉద్రిక్తతల వల్ల కోలుకోలేకపోయాయి. ఒక దశలో సెన్సెక్స్ 700 పాయింట్ల వరకు పడిపోయినప్పటికీ, ఆ తర్వాత కాస్త కోలుకొని ముగిసింది. దింతో చివరికి సెన్సెక్స్ 251.61 పాయింట్లు తగ్గి 77,017.79 వద్ద ముగిసింది. నిఫ్టీ 86.50 పాయింట్లు నష్టపోయి 24,032.80 వద్ద స్థిరపడింది.

స్టాక్ మార్కెట్ పతనానికి ముఖ్య  కారణాలు:
షేర్ మార్కెట్ పడిపోవడానికి అటు దేశీయంగా, ఇటు అంతర్జాతీయంగా కొన్ని కారణాలు ఉన్నాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం. భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే మునుపెన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోవడం.  విదేశీ పెట్టుబడిదారులు (FIIs) భారత మార్కెట్ నుండి నిరంతరం వారి డబ్బును వెనక్కి తీసుకోవడం. ఎన్నికల తర్వాత పెరిగిన షేర్లను అమ్మి పెట్టుబడిదారులు లాభాలను వెనక్కి తీసుకోవడం, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మరియు ద్రవ్యోల్బణంపై స్పష్టత లేకపోవడం

లాభపడిన షేర్లు: ఎం&ఎం, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ , హిందుస్థాన్ యూనీలీవర్, 

నష్టపోయిన షేర్లు: ఐసిఐసిఐ బ్యాంక్, టెక్ మహీంద్రా,యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ ,ఎల్ అండ్ టీ (L&T)

అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో, వాల్ స్ట్రీట్ రికార్డు స్థాయిల నుంచి పడిపోవడంతో మంగళవారం ప్రపంచ స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య, తొలుత పెరిగిన చమురు ధరలు మళ్లీ పడిపోయాయి. యూరోపియన్ స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి, బ్రిటన్ FTSE100 0.8 శాతం పడిపోగా, ఫ్రాన్స్ CAC40  0.6 శాతం,  జర్మనీ DAX  1 శాతం లాభపడ్డాయి. మరోవైపు, జపాన్, దక్షిణ కొరియా, చైనా  మార్కెట్లు సెలవుల కారణంగా మూసివేయబడటంతో ఆసియా ట్రేడింగ్  మందగించింది.

►ALSO READ | Aఎలక్ట్రిక్ స్కూటర్ vs ఎలక్ట్రిక్ బైక్: మీకు ఏది బెస్ట్, ఎలా తెలుసుకోవాలంటే...!