ఆల్ టైం రికార్డ్ను సృష్టించిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్‌, నిఫ్టీలు గరిష్ఠ స్థాయికి

ఆల్ టైం రికార్డ్ను సృష్టించిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్‌, నిఫ్టీలు గరిష్ఠ స్థాయికి

దేశీయ స్టాక్ మార్కెట్ ఆల్ టైం రికార్డు సృష్టించింది. జూన్ 28వ తేదీ బుధవారం దేశీయ బెంచ్‌ మార్క్‌ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ట్రేడింగ్‌లో సెషన్‌లో సెన్సెక్స్‌ తొలిసారిగా 64 వేల మార్క్‌ను అధిగమించింది. మరో వైపు తొలిసారిగా నిఫ్టీ 19వేల మార్క్‌ను తాకింది. సెన్సెక్స్‌ దాదాపు 600 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్లపైగా లాభంతో ట్రేడవుతోంది. మెటల్ రంగ షేర్లు మార్కెట్‌ జీవిత గరిష్ఠానికి చేరుకునేందుకు దోహదం చేశాయి.

జూన్ 28న ట్రేడింగ్‌ మూడు సెషన్లలో ఇన్వెస్టర్లు రూ.3 లక్షల కోట్లపైగా లాభాలను ఆర్జించారు. జూన్‌ డెరివేటివ్‌ సిరీస్‌ గడువు ముగియడం మార్కెట్‌ ఆల్‌ టైమ్‌ హైకి చేరుకోవడంలో ఉపకరించాయి. ఇవాళ ఉదయం సెన్సెక్స్ 63,701.78 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 200 పాయింట్ల వరకు ఎగబాకి 63,716.00 పాయింట్ల ఆల్‌టైమ్ హైకి చేరింది. నిఫ్టీ 62.40 పాయింట్లు పెరిగి 18,879.80 వద్ద మొదలైంది.

NSEలో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఆటో, సన్ ఫార్మా, టాటా మోటార్స్, టైటాన్, డాక్టర్ రెడ్డీస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బీపీసీఎల్, ఎల్ టి, ఎన్టీపీసీ, రిలయన్స్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, యూపీఎల్, కోల్ ఇండియా, బ్రిటానియా, ఎస్బీఐ లైఫ్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా ట్రేడింగ్ ముగించాయి. హెచ్డీఎఫ్సీ లైఫ్, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్, హీరో మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, విప్రో, కోటక్ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టపోయి టాప్ లూజర్లుగా ట్రేడింగ్ ముగించాయి.

కాగా డాలర్ తో పోల్చితే రూపాయి విలువ 4 పైసలు బలపడింది. మంగళవారం రూ. 82.04 గా ఉన్న రూపాయి విలువ, బుధవారం 4 పెసలు బలపడి రూ. 82 వద్ద ట్రేడ్ అవుతోంది.