Good Health : పిల్లల్లో తరచూ కడుపునొప్పి వస్తుందా.. కారణాలు ఇవే.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి..!

Good Health : పిల్లల్లో తరచూ కడుపునొప్పి వస్తుందా.. కారణాలు ఇవే.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి..!

పిల్లలు కడుపునొప్పితో బాధపడటానికి చాలా కారణాలుంటాయి. వాటిలో ఫుడ్ మొదటిది. సరైన ఫుడ్ తీసుకోకపోవడం, శుభ్రంగా లేని ఆహారాన్ని తినడం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఆహారం సరిగా ఉడికించకపోవడం వల్ల తిన్నది సరిగా జీర్ణం కాదు. అప్పుడు కడుపులో నొప్పి మొదలవుతుంది. విరేచనాలు సాఫీగా లేకున్నా కడుపు నొప్పి వస్తుంది. కడుపులో నులిపురుగులు పెరగడం, అపెండిసైటిస్, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం, పిత్తాశయంలో రాళ్లు తయారవ్వడం, హెర్నియా, ట్రాన్సిల్స్ ఇన్ఫెక్షన్స్, జాండిస్,  టైఫాయిడ్, మూత్రాశయంలో ఇన్ ఫెక్షన్ వల్ల కూడా కడుపులో నొప్పి వస్తుంది. ఈ సమస్యలు రాకుండా ఉండాలన్నా, తగ్గాలన్నా మంచి ఫుడ్ తీసుకోవడం పిల్లలకు అలవాటు చేయాలి. కడుపు నొప్పి తరచుగా వస్తున్నా, రాత్రిళ్లు వచ్చే నొప్పి ఎక్కువ సేపు ఉన్నా తప్పకుండా డాక్టర్ కి చూపించాలి. 

ALSO READ : కల్తీ కల్లు ఘటన: కల్లు కాంపౌండ్ ఓనర్ మాస్టర్ ప్లాన్.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్

కడుపు నొప్పి రాకుండా పాటించాల్సిన జాగ్రత్తలు 

  •  భోజనం చేసే ముందు చేతులు శుభ్రంగా కడగడం అలవాటు చేయాలి
  • ఆ చేతి గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉండాలి.
  •  బాగా ఉడికించిన ఆహారంపెట్టాలి
  •  కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగించాలి.
  • ప్రతి రోజూ ఏడెనిమిది గ్లాసులునీళ్లు తాగించాలి.
  • కొద్దిగా వేడిగా ఉన్న అన్నం మాత్రమే పెట్టాలి.
  • డాక్టర్ సలహా లేకుండా పిల్లలకు పెయిన్ కిల్లర్స్ ఇవ్వకూడదు. 
  • ఆహారం, నీళ్లు కలుషితం కాకుండా చూసుకోవాలి.