కంపెనీ క్యాంటిన్ సమోసాల్లో రాళ్లు, గుట్కా ప్యాకెట్లు.. అవి కూడా..

కంపెనీ క్యాంటిన్ సమోసాల్లో రాళ్లు, గుట్కా ప్యాకెట్లు.. అవి కూడా..

క్యాటరింగ్ కాంట్రాక్ట్ దక్కించుకునేందుకు ఓ బిజినెస్ మ్యాన్ ఫుడ్ లో వేవి పడితే అవి కలపడానికి సిద్దపడ్డాడు. పూణెలోని పింప్రి-చించ్‌వాడ్‌లోని ఒక ప్రతిష్టాత్మక కంపెనీ క్యాంటీన్‌లో సమోసాలు సప్లై చేయడానికి కాంట్రాక్ట్ దక్కించుకోవాలని ఓ వ్యక్తి అనుకున్నాడు. కంపెనీతో సొంత కాంట్రాక్ట్ క్యాన్సల్ చేశారు. తిరిగి మళ్లీ కొత్తగా కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి సమోసాలలో కండోమ్‌లు, రాళ్లు, పొగాకు, గుట్కా లాంటి పదార్థాలు కలిపినట్లు పోలీసులు చేసిన ఇన్వేస్టిగేషన్ లో తేలింది.

మార్చి 27 ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనపై పోలీసులు ఐదుగురిపై కేసు ఫైల్ చేశారు. అందులో ఓ వ్యక్తిని అరెస్ట్ కూడా చేశారు. అప్పటికే తాను కంపెనీకి సమోసాలు సప్లై చేస్తు్న్నారు. కంపెనీ ఆ క్యాటరింగ్ కాంట్రాక్ట్ ను రద్దు చేసి.. కొత్త క్యాటరింగ్ కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ఆ కొత్త కాంట్రాక్ట్ కుదుర్చుకుంది కూడా ఇదివరకు సమోసాలు సప్లై చేసిన వ్యక్తే అని పోలీసులు విచారణలో తేల్చారు.