లడఖ్ సంస్కృతిపై దాడి..బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శ

లడఖ్ సంస్కృతిపై దాడి..బీజేపీపై రాహుల్  గాంధీ విమర్శ

న్యూఢిల్లీ: లడఖ్ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాడి చేస్తున్నదని కాంగ్రెస్ లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. గత వారం లేహ్​లో జరిగిన హింసాకాండ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఈ అల్లర్లలో భాగంగా చోటు చేసుకున్న కాల్పుల్లో నలుగురు చనిపోగా, అనేక మంది గాయపడ్డారు. ఈ హింసలో పాల్గొన్నారనే ఆరోపణ లతో ఇప్పటి వరకు యాభై మందిని అదుపులోకి తీసుకున్నారు. 

లడఖ్‌‌‌‌‌‌‌‌ కు రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న యాక్టివిస్టు సోనమ్ వాంగ్‌‌‌‌‌‌‌‌ చుక్‌‌‌‌‌‌‌‌ ను నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అరెస్టు చేసి రాజస్తాన్​లోని జోధ్‌‌‌‌‌‌‌‌పూర్ జైలులో ఉంచారు. దీంతో రాహుల్ గాంధీ ఆదివారం ‘ఎక్స్’ లో పోస్ట్ పెట్టారు.