ఆగిన ఆర్టీసీ బస్సు : ప్రయాణికులతో నెట్టించారు

ఆగిన ఆర్టీసీ బస్సు : ప్రయాణికులతో నెట్టించారు

కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్​లో ఒకే రోజు రెండు ఆర్టీసీ బస్సులకు తృటిలో ప్రమాదాలు తప్పాయి. ఓ బస్సులో పొగలు వ్యాపించగా మరో బస్సుకు రోడ్డు ప్రమాదం తప్పింది.  మంథని డిపో కు చెందిన బస్సు కరీంనగర్ మీదుగా సికింద్రాబాద్ వెళుతోంది. నగరంలోని కోర్టు చౌరస్తా సమీపంలో ఒక్కసారిగా బస్సులో పొగలు వచ్చాయి. బస్సు ఇంజిన్ నుంచి  పొగలు రావడంతో అందులో ఉన్న 17 మంది ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. తేరుకున్న డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేశాడు. ప్రయాణికులు బస్సు దిగి పరుగులు తీశారు. అనంతరం బస్సును స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. చివరకు బస్సును స్థానికులు, ప్రయాణికులు నెట్టినా ఇంజన్ ఆన్ అవలేదు.

మరో బస్సుకు తప్పిన ప్రమాదం

కరీంనగర్ శివారులోని తీగలగుట్టపల్లిలో ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేసేందుకు ఓ కారు యత్నించింది. కరీంనగర్ డిపో 2కు చెందిన ఆర్టీసీ బస్సు లక్షేటిపేట నుంచి కరీంనగర్ వైపు వస్తున్న బస్సును ఓవర్ టేక్ చేస్తుండగా ఎదురుగా మరో వాహనం రావడంతో సడన్ గా బ్రేక్ వేశాడు. దీంతో కారు వెనక భాగాన్ని బస్సు ఢీ కొట్టింది. బస్సు బ్రేక్ వేయకపోతే భారీ ప్రమాదం చోటు చేసుకునేదని ప్రయాణికులు తెలిపారు. కారు పాక్షికంగా ధ్వంసమైంది. ఎలాంటి ప్రాణ నష్టం, గాయాలు కాకపోవడంతో కారులో ఉన్న 5గురు, బస్సులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తల కోసం