సూర్యాపేట బార్డర్‌లో ఏపీ అంబులెన్స్‌లు నిలిపివేత

సూర్యాపేట బార్డర్‌లో ఏపీ అంబులెన్స్‌లు నిలిపివేత

కోవిడ్ చికిత్స కోసం ఆంధ్రా నుంచి తెలంగాణకు వచ్చే అంబులెన్సులకు, వ్యక్తి గత వాహనాలకు అనుమతి తప్పని సరి చేస్తూ సూర్యాపేట జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. హాస్పిటల్ అపాయింట్మెంట్‌తో పాటుగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వారి ఆథరైజేషన్ పాస్ తప్పనిసరిగా ఉండాలని ఎస్పీ తెలిపారు. 

‘ఆంధ్రా నుంచి తెలంగాణకు కోవిడ్ చికిత్స కోసం వచ్చే అంబులెన్సులను, వ్యక్తిగత వాహనాలను ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు వద్ద తనిఖీలు చేస్తున్నాం. అలా వచ్చే వాళ్లు సంబంధిత హాస్పిటల్ అపాయింట్మెంట్‌తో పాటుగా డైరెక్టట్ ఆఫ్ హెల్త్ కోవిడ్ కంట్రోల్ సెంటర్ వారి ఆథరైజేషన్ పాస్ కచ్చితంగా ఉంటేనే తెలంగాణాలోకి అనుమతి ఇస్తున్నాం. హాస్పిటల్ అపాయింట్మెంట్ లెటర్ ఒక్కటే ఉంటే సరిపోదు. కచ్చితంగా హెల్త్ డైరెక్టర్ పాస్ కూడా ఉండాలి. అన్ని అనుమతి పత్రాలు పొందిన తర్వాతే చికిత్సకు బయలుదేరాలి. ఎంట్రీ పాసులు లేకుండా సరిహద్దు వద్దకు వచ్చి ఇబ్బందులు పడొద్దు’ అని సూర్యాపేట జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా.. ఎస్పీ ఉత్తర్వులతో పోలీసులు తెలంగాణ బార్డర్‌లో అంబులెన్స్‌లను ఆపేస్తున్నారు. దాంతో అంబులెన్స్‌లలోని కరోనా పేషంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.