వ్యాపారాల్లో రాణిస్తున్న హీరోల భార్యలు

వ్యాపారాల్లో రాణిస్తున్న హీరోల భార్యలు

సినీ సెలబ్రిటీస్ పై ప్రేక్షకులకు ఒక ప్రత్యేక అభిమానం ఉంటుంది. ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. వాళ్లేం చేస్తుంటారు ? వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తుంటారు ? సినిమాల్లోనే ఉన్నారా? ఇంకేమైనా వ్యాపారాలు ఉన్నాయా? అనేది తెలుసుకోవాలన్న ఆసక్తి సగటు అభిమానిలో ఉంటూనే ఉంటది. ఇక హీరో భార్యల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మరింత ఎక్కువగా ఉంటుంది.

గతంలో హీరోల భార్యలు, కుటుంబసభ్యుల గురించి పెద్దగా ఎవరికి తెలిసేది కాదు. తెలుసుకుందాం అనుకున్నా... పెద్దగా అవకాశం ఉండేది కాదు. కానీ రోజులు మారే కొద్ది.. వస్తున్న టెక్నాలజీ వల్ల.. ప్రతీ ఒక్కరి లైఫ్ సోషల్ మీడియాలో ఉండిపోతోంది. ఇందులో సెలబ్రిటీలది మరీనూ!!  వాళ్లు ఎక్కడున్నారు ? ఎవరిని కలుస్తున్నారు ? ఇలా ప్రతీది అప్ డేట్ చేస్తుంటారు. దీంతో హీరోలతో పాటు వాళ్ల భార్యలకు ఫాలోవర్స్ భారీగా పెరుగుతున్నారు. ఇప్పుడు వాళ్లు కూడా చిన్నపాటి సెలబ్రిటీలు అయిపోతున్నారు. ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని కాపాడుకుంటూనే తాము చేసే బిజినెస్ ల గురించి, చారిటీల గురించి వివరిస్తూ.. మరింత మంది ఫాలోవర్స్ ను ఆయా హీరోల భార్యలు పెంచుకుంటున్నారు.

నమ్రతా శిరోద్కర్ 

ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మన ప్రిన్స్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్. మహేష్ ను లవ్ మ్యారేజ్ చేసుకున్న నమ్రతా... పెళ్లి తర్వాత పూర్తిగా నటనకి దూరం అయినా.. ఇండస్ట్రీకి మాత్రం దగ్గర్లోనే ఉంది. మహేష్ బాబుని బ్రాండ్ గా చూపిస్తూ హంబుల్ అనే టెక్ట్స్ టైల్ ఇండస్ట్రీని ఏర్పాటు చేసింది. ఫ్యాషన్ వేర్ తో పాటు ఏషియన్ సంస్థతో కలిసి ఏ.ఎమ్.బి. పేరుతో లగ్జరీ మల్టీప్లెక్స్ లను స్థాపించింది. మహేష్ బాబు ప్రొడక్షన్ హౌజ్ పనులను కూడా దగ్గరుండి తానే చూసుకుంటుంది. 

ఉపాసన 

ఇక రామ్ చరణ్ భార్య ఉపాసన సైతం బిజినెస్ తైకూన్ గా రాణిస్తోంది. అపోలో హాస్పటల్స్ కి వైస్ చైర్మన్ గా ఉన్న ఉపాసన.. హాస్పిటల్స్ వ్యవహారాలతో పాటు ఫౌండేషన్ పనులు చూసుకుంటోంది. దీంతో పాటు ఎయిర్ లైన్స్ బిజినెస్ లోనూ చురుగ్గా ఉంటోంది ఉపాసన.

స్నేహా రెడ్డి

అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి తన తండ్రి స్థాపించిన సేయింట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి డైరెక్టర్ గా ఉన్నారు.

లక్ష్మీ ప్రణతి

ఎంబీఏ పూర్తి చేసిన జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి త్వరలోనే ఎంటర్టైన్మెంట్ ఛానెల్ స్థాపించబోతున్నట్లు సమాచారం.

అంజలి 

వరుస హిట్లతో  దూసుకెళ్తున్న నాని భార్య అంజలి.. రాజమౌళి స్కూల్ లో చేరిపోయింది. ప్రస్తుతం ఆర్కా మీడియాలో క్రియేటివ్ హెడ్ గా పని చేస్తున్న అంజలి.. బాహుబలి టైమ్ లోను వర్క్ చేసింది. ఇక అల్లరి నరేశ్ భార్య ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ స్థాపించి సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తోంది. దీంతో పాటు అరవింద్ క్రిష్ణ భార్య దీపిక ప్రసాద్ ఐటీ రంగంలో రాణిస్తోంది. వివిధ స్టార్టప్ లలో ఇన్వెస్ట్ చేసిన ఆమె యంగ్ బిజినెస్ ఉమెన్ గా పలు అవార్డ్స్ ను అందుకుంది.

క్యారెక్టర్ ఆర్టిస్టుల భార్యలు 

హీరోలతో పాటు ఎంతోమంది టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుల భార్యలు సైతం వ్యాపార రంగాల్లో రాణిస్తున్నారు. ఈ జాబితాలో ఆదర్శ్ బాలక్రిష్ణ భార్య గుల్నర్, రజీవ్ కనకాల భార్య సుమ కోట్లల్లో సంపాదిస్తున్నారు. ఇక అందాల రాక్షసి హీరో రాహుల్ రవీంద్ర.. తన భార్య చిన్మయి తనకన్నా ఎక్కువగా ట్యాక్స్ కడుతుందని గతంలో బహిరంగంగానే ప్రకటించారు.