గేమ్ ఛేంజర్ ఎలా మొదలైందో చెప్పేసిన.. స్టోరీ రైటర్ కార్తీక్ సుబ్బరాజ్

గేమ్ ఛేంజర్ ఎలా మొదలైందో చెప్పేసిన.. స్టోరీ రైటర్ కార్తీక్ సుబ్బరాజ్

విలక్షణ హీరోస్ ఉంటారు..విలక్షణ నటులుంటారు. అలాగే విలక్షణ డైరెక్టర్స్ కూడా ఉన్నారు..అందులో ఒకరు కార్తీక్‌ సుబ్బరాజ్( Karthiksubbaraj). అతని మూవీస్ చూస్తే..పిజ్జా, జగమే తంత్రం, మహాన్, పెట్టా, జిగర్తాండ, ఇప్పుడు జిగర్ తండ డబుల్ X. ఇందులో ఈ మూవీని చూసిన ఇట్టే అర్థమైతది..కార్తీక్ సుబ్బరాజ్ ఎంత విలక్షణమైన డైరెక్టర్ అనేది. 

కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన జిగర్ తండ డబుల్ X మూవీ రేపు(నవంబర్ 10 న) విడుదలకు సిద్ధం అయింది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా.. కార్తీక్‌ సుబ్బరాజ్‌ ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గేమ్‌ ఛేంజర్ (GameChanger) మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు తెలియజేశాడు.

గేమ్‌ చేంజర్ మూవీని డైరెక్ట్ చేసేది శంకర్ అని అందరికీ తెలిసిందే. కానీ ఈ భారీ చిత్రాన్నికి కథను అందించింది మాత్రం..డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ అని.. చాలా తక్కువ మందికే తెలుసు. మరి ఇంతటి అద్భుతమైన కథను..తెరక్కించాలంటే..డైరెక్షన్ మాత్రమే వస్తే సరిపోదు..ఆ కథను మోయగలిగే ధైర్యం కూడా ఉండాలని చెప్తున్నారు..కార్తీక్. మరి అది ఎందుకో తెలుసుకుందాం. 

రీసెంట్గా ఒక ఇంటర్వూలోకార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ..తన కెరీర్‌ లోనే మొదటి పొలిటికల్‌ స్టోరీ గేమ్‌ చేంజర్‌. ఆ కథ ను పూర్తి చేసిన తర్వాత..నా బెస్ట్ ఫ్రెండ్స్కు వినిపించాను. అది విన్న ప్రతి ఒక్కరికి కథ చాలా బాగా నచ్చింది. మెయిన్గా పెద్ద సినిమాల శంకర్‌ స్థాయిలో ఈ స్టోరీ ఉంది. ఈ సినిమా చాలా పెద్దగా చేయవచ్చని ఫ్రెండ్స్ సలహా ఇచ్చారని తెలిపారు. 

అలాగే నేను కథను స్టార్ట్ చేసినప్పుడు భారీ స్థాయిలో మెసేజ్ ఉండి..దానికి తోడు పొలిటికల్ టచ్ ఉండాలని రాసుకున్నాను. కానీ తీరా స్టోరీ పూర్తయ్యాకే తెలిసింది. ఇంత పెద్ద పొలిటికల్‌ మూవీని తీసే అనుభవం..ఆ స్థాయి నాకు లేదని. అందుకే ఈ స్టోరీని శంకర్ సర్కి వినిపించాను. అపుడు ఆయన స్టోరీ చెప్పగానే ఇంప్రెస్ అయ్యి..సినిమా తెరకెక్కించాలని కూడా సిద్ధం అయ్యారని కార్తీక్‌ ఇంటర్వ్యూలో వివరించాడు. 

రామ్‌ చరణ్ వంటి స్టార్‌ హీరోతో ఈ సినిమాను రూపొందించడం వల్ల..ఈ సినిమా స్థాయి మరింత పెరిగిందని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌ తెలియజేశారు. గేమ్‌ ఛేంజర్ సినిమా తప్పకుండా అన్ని వర్గాల వారిని అలరిస్తుందని అన్నారు. 

ఇక లేటెస్ట్ జిగర్‌‌‌‌ తండ  డబుల్ ఎక్స్ మూవీలో రాఘ‌‌వ లారెన్స్‌‌, ఎస్‌‌.జె.సూర్య లీడ్ రోల్స్‌‌లో నటిస్తున్నారు. స్టోన్ బెంచ్ ఫిలింస్ బ్యానర్‌‌‌‌పై కార్తికేయన్ సంతానం, ఎస్.కదిరేశన్ నిర్మించిన ఈ మూవీ..తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నవంబర్ 10న విడుదల కానుంది.