పెనుకొండలో ప్రత్యక్షమైన వింతపక్షి

పెనుకొండలో ప్రత్యక్షమైన వింతపక్షి

ఆఫ్రికన్ బర్డ్ బిల్డ్ హార్నిబిల్ లా కనిపిస్తున్న పక్షి.. అటవీ అధికారులకు అప్పగించిన రైతు

అనంతపురం: పెనుకొండలో వింతపక్షి కనిపించింది.  ఓ రైతు దాన్ని గుర్తించాడు. ఎగరకుండా పడి ఉండడంతో దాని తల్లి  లేదా.. దాని జతకు ఇంకా ఏమైనా ఉన్నాయోమేనని చాలా సేపు చూసినా ఆచూకీ కనిపించలేదు. దీంతో సదరు రైతు తనకు కనిపించిన వింత పక్షిని తీసుకుని పెనుకొండ అటవీశాఖ అధికారులకు అప్పగించారు. వారు దాన్ని పక్షుల సంరక్షణ కేంద్రంలో పెట్టారు. ఇది ఏ జాతి పక్షి.. ఎక్కడి నుండి వచ్చి ఉంటుందోనని ఆరా తీసే ప్రయత్నం చేసేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఆఫ్రికన్ పక్షిలా కనిపిస్తుండడంతో ఆరోగ్య పరీక్షలు చేయించి నిర్ధారించుకునేందుకు వైద్య నిపుణులను రప్పిస్తున్నట్లు సమాచారం.ఈ పక్షి చూడడానికి ఆఫ్రికన్ జాతికి చెందిన లేత బిల్డ్ హార్న్ బిల్ లా కనిపిస్తోంది. బుసెరోటిడే కుటుంబానికి చెందిన హార్న్ బిల్ జాతి పక్షిలా ఉంది. ఇది ఎక్కువగా అంగోలా, కాంగో, కెన్యా, మాలావి, మొజాంబిక్, టాంజానియా మరియు జాంబియా తదితర దేశాల్లో కనిపిస్తుంది.

ఇవీ చదవండి

ప్రతి ఇంటికి ఉచితంగా ఇంటర్నెట్.. సగం ధరకే లాప్‌టాప్

గాలిపటం కోసం పరిగెడుతూ..పెంటకుప్పలో పడి బాలుడి మృతి

మొక్కను దొంగిలించారని పోలీసులకు ఫిర్యాదు.. ఇద్దరి అరెస్ట్