తిరుపతిలో విచిత్రం జరిగింది. నీరు నిల్వ చేసుకునేందుకు భూమిలో వేసిన సిమెంట్ రింగులు పైకి వచ్చేశాయి. నీళ్ల కోసం భూమి లోపల మొత్తం 25 రింగులతో ట్యాంక్ ఏర్పాటు చేశారు. అందులోని 18 రింగులు పైకి వచ్చేశాయి. వర్షాలు, వరదతో ట్యాంకులో బురద చేరడంతో కుటుంబ సభ్యులు దాన్ని క్లీన్ చేసేందుకు అందులోకి దిగారు. క్లీన్ చేస్తున్న సమయంలో ట్యాంక్ పైకి రావడం గమనించిన మహిళ అందులోంచి బయటకు దూకేసింది. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. తిరుపతిలోని శ్రీ కృష్ణా నగర్ లో ఈ ఘటన జరిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగానే ట్యాంక్ పైకి లేచినట్టుగా భావిస్తున్నారు.