ఇద్దరు పిల్లలపై కుక్క దాడి.. ఎర్రుపాలెంలో ఘటన

ఇద్దరు పిల్లలపై కుక్క దాడి..  ఎర్రుపాలెంలో ఘటన

ఎర్రుపాలెం,వెలుగు : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో ఆదివారం ఇద్దరు చిన్నారులపై వీధి కుక్క దాడి చేసింది. స్థానికుల కథనం ప్రకారం..కాలనీకి చెందిన నాగలవంచ లక్ష్మి(9), వెంకట్రావు(8) ఆదివారం ఉదయం ఇంటి బయట ఆడుకుంటున్నారు.

అటుగా వచ్చిన ఓ కుక్క లక్ష్మి, వెంకట్రావులపై పడి కరిచింది. దీంతో ఇద్దరూ గాయపడ్డారు. స్థానికులు వెంటనే కుక్కను తరిమి గాయపడిన వారిని బనిగడ్లపాడు పీహెచ్​సీకి తరలించారు. తమ గ్రామంలో వీధి కుక్కులు ఎక్కువయ్యాయని, వాటి బారి నుంచి కాపాడాలని కాలనీవాసులు కోరుతున్నారు.