ఈ కుక్క ముందు చిరుత పంజా పనిచేయలే.. చిరుతను 300 మీటర్లు ఈడ్చుకెళ్లి.. పరిగెత్తించిన స్ట్రీట్ డాగ్.. వీడియో వైరల్

ఈ కుక్క ముందు చిరుత పంజా పనిచేయలే.. చిరుతను 300 మీటర్లు ఈడ్చుకెళ్లి.. పరిగెత్తించిన స్ట్రీట్ డాగ్.. వీడియో వైరల్

చిరుత పులి vs వీధి కుక్క మధ్య ఫైట్ అంటే ఎవరైనా ఏం చెబుతారు.. చిరుతే గెలుస్తుందని టక్కున చెప్పేస్తారు. చిరుత గెలుస్తుంది కూడా. కానీ ఒక్కోసారి సీన్ రివర్స్ అవుతుంటుంది. ఈ ఫైట్ లో కూడా అదే జరిగింది. చిరుతతో జరిగిన భీకర యుద్ధంలో వీధి కుక్క గెలవటమే కాదు.. చిరుతను పరుగులు పెట్టించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో చూసి.. స్ట్రీట్ డాగ్స్.. మనుషులనే కాదు పులులను కూడా పరుగులు పెట్టిస్తాయ్ అని కామెంట్స్ చేస్తున్ననారు నెటిజన్లు. 

చిరుతను శునకం పరుగులు పెట్టించిన ఘటన మహారాష్ట్రలోని నాశిక్ సిటీలోని నిఫాద్ ఏరియాలో జరిగింది. రెండింటి మధ్య జరిగిన పోరులో చిరుతను నోటిలో కరిచి 300 మీటర్లు ఈడ్చుకెళ్లింది. అడవిలో నుంచి సిటీలోకి ప్రవేశించిన చిరుత.. కాలనీలో ఉన్న వీధి కుక్కను ఎత్తుకెళ్లాలని ప్లాన్ చేసింది. కుక్కపై అటాక్ చేయబోగా.. అంతే స్థాయిలో కౌంటర్ అటాక్ ఇచ్చింది ఈ శునకం. 

చిరుత నోటిని అందుకుని వదలకుండా పట్టుకుంది. పంజాతో విడిపించుకునే ప్రయత్నం చేసినా అలాగే పట్టుకుని జరజర ఈడ్చుకుంటూ వెళ్లింది కుక్క. ఈ ఫైట్ ను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు.. చిరుత ఎంత ప్రయత్నం చేసినా స్ట్రీట్ డాగ్ వదలలేదని చెబుతున్నారు. పంజాలతో కొడుతూ చివరికి చిరుత వదిలించుకుని పరుగు తీసిందని చెబుతున్నారు. 

►ALSO READ | టికెట్ లేకుంటే ఫైన్ వేయాలి.. ఇంత ఘోరంగా కొట్టుడేంది సారూ..? రైల్వే పోలీస్ తీరుపై నెటిజన్ల ఫైర్

చిరుత పంజా దాడికి గాయపడినప్పటికీ.. వదలకుండా ఆ కుక్క చుక్కలు చూపించిందని చెబుతున్నారు. చిరుత డాడిలో కుక్క గాయపడినప్పటికీ.. ప్రాణాలతో బయటపడిందని తెలిపారు. 

ఫైట్ ముగిసిన తర్వాత చిరుత దగ్గర్లో ఉన్న పంట పొలాలకు పరిగెట్టినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. చిరుతకు గాయాలైనట్లు చెప్పిన అధికారులు.. దానికి మెడికల్ ట్రీట్ మెంట్ అవసరమో లేదో అనేది కన్ఫామ్ చేయలేదు. కానీ గ్రామస్తులు, పెంపుడు జంతువులు చిరుత దాడి నుంచి బయటపడ్డాయని తెలిపారు. ఒకవైపు వీధి కుక్కలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సందర్భంలో.. స్ట్రీట్ డాగ్ చిరుతకు చుక్కలు చూపించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  

మరోవైపు వీధికుక్కల అంశం శుక్రవారం (ఆగస్టు 22) సుప్రీం కోర్టు విచారణకు వచ్చింది. జస్టిస్ విక్రమ్ నాథ్ అధ్యక్షతన ప్రత్యేక బెంచ్ ఈ కేసును విచారించింది. వ్యాక్సినేషన్ వేసిన కుక్కలను మాత్రమే వీధుల్లో వదలాలని లేదంటే వాటిని స్థావరాల్లోనే ఉంచాలని తీర్పును ఇచ్చారు. ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.