టికెట్ లేదని ప్యాసెంజర్ ను రైల్వే పోలీస్ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టికెట్ లేకుంటే ఫైన్ వేయాలి.. లేదంటే తర్వాతి స్టేషన్ లో దించేయాలి.. కానీ ఆ కొట్టుడేంది సారూ.. అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు వీడియోను వైరల్ చేస్తున్నారు. ప్రయాణికుడిని బలవంతంగా ట్రైన్ నుంచి తోసేయాలని చూసిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) కానిస్టేబుల్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ప్యాసెంజర్ ను కొట్టడం, డోర్ వైపు లాగడం, డోర్ ఓపెన్ చేసి తోసేసే ప్రయత్నం చేయడం వీడియోలో చూడవచ్చు. ప్యాసెంజర్ టికెట్ లేకుండా ప్రయాణించాడని.. అందుకే దించే ప్రయత్నం చేసినట్లు కానిస్టేబుల్ చెబుతున్నాడు. కానీ అది దించే ప్రయత్నం కాదు.. బలవంతంగా తోసేయడం.. ఇష్టమొచ్చినట్లు కొట్టడం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ALSO READ : స్కెచ్ వేసి.. స్క్రిప్ట్ రాసి.. టెన్త్ క్లాసులోనే ఇంత క్రిమినల్ బ్రెయినా
ఆగస్టు 18 న ఢిల్లీలోని సరై రహిళ్ల స్టేషన్ లో ఘటన జరిగినట్లు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ స్టేట్ మెంట్ విడుదల చేసింది. రిపోర్టు ప్రకారం.. ప్యాసెంజర్ దగ్గర టికెట్ లేకపపోవడంతో కానిస్టేబుల్ చైన్ లాగడంతో ట్రైన్ ఆగిపోయింది. అయితే ట్రైన్ అప్పటికీ స్టేషన్ లోనే ఆగిందని.. ప్యాసెంజర్ ను స్టేషన్ లో దించే ప్రయత్నం చేశాడని RPF పేర్కొంది. కదులుతున్న రైలు నుంచి తోసేసే ప్రయత్నం చేశాడనే ఆరోపణలను ఖండించింది.
సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆగ్రహం వెల్లువెత్తుతుండటంతో.. కానిస్టేబుల్ ను విచారణ కోసం దయా బస్తిలోని RPF రిజర్వ్ లైన్ కు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. దర్యాప్తు జరుగుతోందని.. కానిస్టేబుల్ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
दिल दहला देने वाला वीडियो! भारतीय पुलिस ने निर्दोष शख्स को ट्रेन से बाहर फेंकने की कोशिश 🚨@CMOfficeUP @RailMinIndia @RahulGandhi @timesofindia @htTweets @rpbreakingnews pic.twitter.com/cZalJU1LLp
— Nehal (@nehal076) August 19, 2025
