
భారత్ లో డిజిటల్ పేమెంట్లు పెరిగాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. 88వ మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ ప్రసంగించారు. ప్రతి రోజు 20వేల కోట్ల ఆన్ లైన్ చెల్లింపులు జరుగుతున్నాయని అన్నారు.దీనితో డిజిటల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. చిన్న చిన్న గ్రామాలు, దుకాణాలు ఈ రోజుల్లో యూపీఐని ఉపయోగిస్తున్నాయని చెప్పారు. ఇటీవలే ప్రజలకు ప్రధాన మంత్రి సంగ్రాలయం అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సంగ్రాలయాన్ని సందర్శించాలన్నారు.
ఇక దేశ వ్యాప్తంగా మ్యూజియాల డిజిటలైజేషన్ చేస్తున్నామన్నారు మోడీ. ఈ వేసవి కాలంలో నీటిని వృధా చేయొద్దని కోరారు. ప్రతి జీవికి నీరు ప్రాథమిక అవసరమన్నారు. ఇది ముఖ్యమైన సహజవనరు అని గ్రంథాలలో పేర్కొనబడిందని తెలిపారు. హరప్పా నాగరికత సమయంలోనే నీటి ఆదాకు అధునాతన ఇంజినీరింగ్ ఉందని ప్రధాని మోడీ తెలిపారు.
మరిన్ని వార్తల కోసం..