
- వ్యవసాయ శాఖ ఏడీ రాజారత్నం
- కొందుర్గ్ లోని ఫర్టిలైజర్ షాపుల్లోఆకస్మిక తనిఖీలు
షాద్ నగర్,వెలుగు: ఫర్టిలైజర్ షాప్ లు నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ ఏడీ రాజారత్నం హెచ్చరించారు. సోమవారం కొందుర్గ్ లో అగ్రికల్చర్,రెవెన్యూ, పోలీసు అధికారులతో బృందాలు పలు ఫర్టిలైజర్ షాప్ ల్లో ఆకస్మిక తనిఖీలు చేశాయి. అనంతరం ఏడీ రాజారత్నం మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలనే అమ్మాలని స్పష్టంచేశారు. నకిలీ, కాలం చెల్లిన విత్తనాలు అమ్మితే సమాచారం అందించాలని రైతులకు సూచించారు. నకిలీ విత్తనాల అమ్మకాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ తనిఖీల్లో ఏవో శిరీష, ఆర్‌ఐ శివ కుమార్, కొందుర్గ్ ఎస్ ఐ కృష్ణ తదితరులు ఉన్నారు.