
చెరువులో మట్టి పోస్తే కఠిన చర్యలు తప్పవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. శనివారం (మే 17) రియల్ ఎస్టేట్ సంస్థలు, బిల్డర్లు, ట్రాన్స్ పోర్టర్లతో పాటు ఆయా సంఘాల ప్రతినిధులతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చెరువుల్లో మట్టిపోసే వారిని సాక్ష్యాధారాలతో పట్టుకుని క్రిమినల్ కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు.
బిల్డర్లు, ట్రాన్స్‌పోర్టర్లు కలసి.. మట్టిని ఎక్కడ పోయాలో ముందుగానే ఒక అవగాహనకు రావాలని ఆయన సూచించారు. ట్రాన్స్‌పోర్టు ఖర్చులు మిగులుతాయని దగ్గర్లోని చెరువుల ఒడ్డున పడేస్తామంటే వారి వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని చెప్పారు అంతేకాకుండా.. డ్రైవర్, వాహన యజమాని, మట్టిని ఎక్కడి నుంచి తెస్తున్నారో సదరు నిర్మాణ సంస్థ యజమానిపై కూడా క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.
►ALSO READ | వాళ్లను నెల రోజులు బార్డర్లో డ్యూటీ చేయించాలి : ఎంపీ రఘునందన్ రావు
హైడ్రా పోలీసు స్టేషన్ కూడా అందుబాటులోకి వచ్చిందని.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు బుక్ అవుతాయని హెచ్చరించారు కమిషనర్ రంగనాథ్.