డాక్టర్ల రక్షణకు చట్టం అవసరం : హేమమాలిని

డాక్టర్ల రక్షణకు చట్టం అవసరం : హేమమాలిని

న్యూఢిల్లీ: లోక్‌ సభలో డాక్టర్ల కోస మాట్లాడారు ఎంపీ హేమమాలిని. డాక్లర్లపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు కఠినమైన నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. కొంతమంది ముష్కరమూక నుంచి డాక్లరు ఎదుర్కొంటున్న వేధింపులకు ముగింపు పలకాల్సిన అవసరముందని, దీనికోసం కఠినమైన చట్టం తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించారు.

తన సొంత నియోజకవర్గమైన మధురలో ఇటీవలే జరిగిన దాడులను ఈ సందర్భంగా హేమమాలిని ప్రస్తావించారు. పశ్చిమబెంగాల్ లో డాక్టర్లపై జరిగిన దాడులకు నిరసనగా దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. డాక్లరు దేవుడి లాంటి వారని..కొన్ని సార్లు 48 గంటలపాటు కూడా పనిచేస్తుంటారని చెప్పారు హేమమాలిని.