కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ బంగారం, వెండికి మస్తు డిమాండ్.. ఎంత పెరిగాయంటే..

కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ బంగారం, వెండికి మస్తు డిమాండ్.. ఎంత పెరిగాయంటే..

న్యూఢిల్లీ: యుద్ధాలు, ఆర్థిక మాంద్యం భయాల వల్ల 2027 ఆర్థిక సంవత్సరంలోనూ బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సురక్షిత పెట్టుబడి సాధనాలుగా వీటికి డిమాండ్ పెరుగుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. యూఎస్​ఫెడ్​ వడ్డీ రేట్లను గరిష్ఠ స్థాయిలోనే ఉంచడం ధరల పెరుగుదలను కొంత మేర అడ్డుకోవచ్చు.  

మార్చి నెలలో బంగారం ధర ఏడు శాతం, వెండి ధర 15 శాతం వరకు తగ్గినప్పటికీ దీర్ఘకాలంలో వీటి ధరలు పెరిగే సూచనలు ఉన్నాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో వెండి ధరలు ఏకంగా 142.2 శాతం  పెరిగాయి. 2025 ఏప్రిల్ 1న రూ.99 వేలు ఉన్న కిలో వెండి ఏడాదిలో రూ.1.41 లక్షలకు పెరిగింది. 

  • రూ.ఐదు వేలు పెరిగిన వెండి.. పసిడి ధర రూ.2,300 జంప్​

డాలర్ బలహీనత, ముడి చమురు ధరలు తగ్గడంతో వెండి, బంగారం ధరలు సోమవారం పెరిగాయి.  వెండి ధర కేజీకి రూ.ఐదు వేలు పెరిగి రూ.2.42 లక్షలకు చేరింది. క్రితం సెషన్‌లో ఇది రూ.2.37 లక్షల వద్ద ముగిసింది. పసిడి ధర కూడా 10 గ్రాములకు రూ.2,300 మేర పెరిగి రూ.1.53 లక్షల మార్కును దాటింది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.1,53,800 వద్ద స్థిరపడింది.