చైనాలో భూకంపంతో 46 మంది మృతి

చైనాలో భూకంపంతో 46 మంది మృతి

బీజింగ్: చైనాలోని సిచువాన్ ప్రావిన్స్​లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్​పై తీవ్రత 6.8గా నమోదైందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 46 మంది చనిపోయారని వెల్లడించారు. సిచువాన్ రాజధాని చెంగ్డూకు నైరుతి దిక్కున 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైందని, ప్రకంపనల ధాటికి చెంగ్డూలో బిల్డింగ్​లు ఊగిపోయాయని చైనా డైలీ తెలిపింది.

దానికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రావిన్స్​లోని పలు పట్టణాల్లో బిల్డింగ్​లు కూలిపోయాయని, కొండచరియలు విరిగిపడ్డాయని వార్తా సంస్థలు తెలిపాయి. కాగా, 2008లో 8.2 తీవ్రతతో వచ్చిన భూకంపానికి 69,000 మందికి పైగా మరణించారు. 2013లో తీవ్రత 7 తో సంభవించిన భూకంపం 200 మందిని బలిగొంది.