21 కిలో మీటర్లు 25 వేల మంది పోలీసులు

21 కిలో మీటర్లు 25 వేల మంది పోలీసులు
  • 3 కమిషనరేట్ల పరిధిలో గణనాథుల నిమజ్జన శోభాయాత్రకు భారీ బందోబస్తు
  • 560  సీసీ కెమెరాలతో నిఘా, ట్రాఫిక్ ఆంక్షలు 
  • రూట్‌‌‌‌మ్యాప్‌‌‌‌ రిలీజ్ చేసిన పోలీసులు

హైదరాబాద్,వెలుగు: గ్రేటర్ లో గణనాథుల నిమజ్జనానికి పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 9న 3 కమిషనరేట్ల పరిధిలో జరగనున్న నిమజ్జన శోభాయాత్రలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా 25 వేల మంది పోలీసులు.. 560 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాట్లు చేశారు. బాలాపూర్‌‌‌‌‌‌‌‌ నుంచి హుస్సేన్‌‌‌‌సాగర్‌‌‌‌ వరకు జరగనున్న ప్రధాన శోభాయాత్రతో పాటు సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి ట్యాంక్ బండ్ కు వచ్చే గణనాథుల కోసం బందోబస్తును పెంచారు. బుధవారం ట్యాంక్‌‌‌‌బండ్‌‌‌‌పై ఏర్పాట్లను సిటీ సీపీ సీవీ ఆనంద్‌‌‌‌ పర్యవేక్షించారు. స్పెషల్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ రూమ్‌‌‌‌లను పరిశీలించారు. ఈ క్రమంలోనే మఫ్టీ పోలీసులు, షీ టీమ్స్‌‌‌‌, రోప్‌‌‌‌ పార్టీ, టాస్క్‌‌‌‌ఫోర్స్, ట్రాఫిక్ పోలీసులు,స్పెషల్‌‌‌‌ బ్రాంచ్, ఇంటెలిజెన్స్‌‌‌‌ పోలీసులను భారీగా మోహరించేలా ఏర్పాట్లు చేశారు. 

సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలు 

బాలాపూర్‌‌‌‌‌‌‌‌ నుంచి ప్రారంభం అయ్యే శోభాయాత్ర 21 కి.మీ సాగనుంది. చాంద్రాయాణగుట్ట నుంచి ఓల్డ్‌‌‌‌ సిటీ మీదుగా హుస్సేన్‌‌‌‌సాగర్‌‌‌‌‌‌‌‌కు చేరుకోనుంది. దీంతో సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరిస్తున్నారు.  శోభాయాత్ర జరిగే ఫలక్‌‌‌‌నుమా,చార్మినార్‌‌‌‌,అఫ్జ్‌‌‌‌ల్‌‌‌‌గంజ్‌‌‌‌ ప్రాంతాలపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. బారికేడ్స్‌‌‌‌ ఏర్పాటు చేస్తున్నారు. శోభాయాత్రలో కేవలం నిమజ్జనానికి తరలించే వెహికల్స్ ను మాత్రమే అనుమతించనున్నారు. సరూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ మినీ ట్యాంక్‌‌‌‌ బండ్‌‌‌‌, సైబరాబాద్‌‌‌‌ కమిషనరేట్‌‌‌‌ పరిధిలో ఏర్పాట్లు పూర్తి చేశారు. గణేష్ నిమజ్జనం కోసం రూట్‌‌‌‌మ్యాప్ రిలీజ్ చేశారు.  ట్రాఫిక్ ఆంక్షలు, డైవర్షన్స్‌‌‌‌తో గణనాథులను నిమజ్జనానికి తరలించనున్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా 040-–27852482, 9490598985, హెల్ప్‌‌‌‌లైన్‌‌‌‌ నం. 9010203626కు కాల్‌‌‌‌ చేయాలని పోలీసులు సూచించారు.

 శోభాయాత్ర రూట్ మ్యాప్ ఇలా..

    -కేశవగిరి- నుంచి -హుస్సేన్ సాగర్ కు వచ్చే గణనాథులు  చాంద్రాయణగుట్ట, అలియాబాద్, చార్మినార్, మదీనా, అఫ్జల్ గంజ్, గౌలిగూడ చమాన్, గురుద్వార్, జాంబాగ్, ఎంజే మార్కెట్,-అబిడ్స్, -బషీర్‌‌‌‌బాగ్, -లిబర్టీ,- అప్పర్ ట్యాంక్‌‌బండ్‌‌‌‌, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా చేరుకోవాల్సి ఉంటుంది.

    - సికింద్రాబాద్ నుంచి వచ్చే మండపాలు- ఆర్పీ రోడ్, -ఎంజీ రోడ్, -కర్బాల మైదాన్, -కవాడిగూడ,-ముషీరాబాద్ క్రాస్ రోడ్స్,- ఆర్టీసీ క్రాస్ రోడ్, హిమాయత్‌‌‌‌నగర్ వై జంక్షన్, లిబర్టీ మీదుగా చేరుకోవాలి. 

ఉప్పల్‌‌‌‌ వైపు నుంచి వచ్చే విగ్రహాలు

    - రామంతాపూర్, -అంబర్‌‌‌‌పేట్ జంక్షన్,- ఓయూ ఎన్‌‌‌‌సీసీ,-దుర్గా బాయ్ దేశ్‌‌‌‌ముఖ్, -హిందీ మహా విద్యాలయ్ క్రాస్ రోడ్స్,-    - ఫీవర్ హాస్పిటల్,-బర్కత్ పురా క్రాస్ రోడ్స్, -నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌‌‌‌ మీదుగా చేరుకోవాలి.

దిల్ సుఖ్ నగర్, సైదాబాద్ నుంచి విగ్రహాలు

    - దిల్ సుఖ్ నగర్, ఐఎస్ సదన్, సైదాబాద్, చంచల్ గూడ, నల్గొండ క్రాస్ రోడ్స్  మీదుగా ప్రధాన శోభాయాత్రలో కలుస్తాయి.

    - టొలీచౌకి, మెహిదీపట్నం నుంచి వచ్చే గణనాథులు- మాసబ్ ట్యాంక్, -ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ కు చేరుకోవాలి. 

    - సీతారాంబాగ్,-బోయిగూడ కమాన్, -ఓల్గా హోటల్,-అలస్కా మీదుగా మొజంజాహీ మార్కెట్ వద్ద ప్రధాన శోభాయాత్రలో కలుస్తాయి.

నిమజ్జనం ముగిసిన తర్వాత వెహికల్స్ వెళ్లాల్సిన రూట్

అప్పర్ ట్యాంక్‌‌‌‌బండ్‌‌‌‌పై నిమజ్జనం పూర్తి చేసిన వెహికల్స్:  చిల్డ్రన్స్ పార్కు, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ, ముషీరాబాద్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. 

ఎన్టీఆర్ మార్గ్‌‌‌‌లో నిమజ్జనం చేసిన వెహికల్స్ : 

లారీలు,ట్రక్కులు ఎన్టీఆర్ మార్గ్ నుంచి నెక్లెస్ రోడ్స్, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, పీవీ విగ్రహం, కేసీపీ జంక్షన్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

ట్రాఫిక్ డైవర్షన్స్ ఇలా..

మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు

హైదరాబాద్ సౌత్

    - కేశవగిరి, మహబూబ్‌‌‌‌నగర్ క్రాస్ రోడ్స్, ఇంజన్ బౌలి, నాగులచింత, హిమ్మత్‌‌‌‌పురా,హరిబౌలి, అశ్ర హాస్పిటల్,

     - మొగల్‌‌‌‌పురా, మదీనా క్రాస్ రోడ్, ఎంజె బ్రిడ్జి, దారుల్ షిఫా క్రాస్ రోడ్స్, సిటీ కాలేజీ వద్ద ట్రాఫిక్​ను దారి మళ్లిస్తారు.

హైదరాబాద్ సెంట్రల్

    - చాపెల్‌‌‌‌రోడ్-, జీపీవో దగ్గర గద్వాల్ సెంటర్, షాలిమార్ థియేటర్-, గన్‌‌‌‌ఫౌండ్రీ, కంట్రోల్ రూమ్, కళాంజలి,-లిబర్టీ,  జంక్షన్-,జీహెచ్ఎంసీ వై జంక్షన్-,తెలుగు తల్లిప్లె ఓవర్ వద్ద వెహికల్స్ దారి మళ్ళింపు

    - బీఆర్‌‌‌‌కే భవన్ జంక్షన్, -ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి, ద్వారకా హోటల్ జంక్షన్, ఖైరతాబాద్ జంక్షన్, చిల్డ్రన్స్ పార్క్, వైస్రాయ్ హోటల్ జంక్షన్, కవాడిగూడ జంక్షన్, ముషీరాబాద్ క్రాస్ రోడ్,

     - లోయర్ ట్యాంక్ బండ్‌‌‌‌లోని కట్టమైసమ్మ టెంపుల్, ఇందిరా పార్కు జంక్షన్ వద్ద వెహికల్స్ దారి మళ్లింపు.

హైదరాబాద్ ఈస్ట్

    - నయాపూల్‌‌‌‌ క్రాస్‌‌‌‌ రోడ్స్‌‌‌‌, రంగ్‌‌‌‌మహల్‌‌‌‌ జంక్షన్‌‌‌‌, చాదర్‌‌‌‌ఘాట్‌‌‌‌ జంక్షన్‌‌‌‌, ఆంధ్రాబ్యాంక్‌‌‌‌, క్రౌన్‌‌‌‌ కేఫ్‌‌‌‌, అంబర్‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌ గ్రీన్‌‌‌‌ బావర్చి వద్ద వెహికల్స్ దారిమళ్ళింపు

హైదరాబాద్ వెస్ట్

    - తోపె ఖానా మాస్క్,-అలస్కా హోటల్ జంక్షన్,-ఉస్మాన్ గంజ్-శంకర్ బాగ్,-సీనా హోటల్,-ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దగ్గర అజంతా గేట్,-అబ్కారీ లేన్-,

     - తాజ్ ఐలాండ్, - కేఎల్‌‌‌‌కే బిల్డింగ్‌‌‌‌, -ఏఆర్ పెట్రోల్ పంప్ వద్ద ట్రాఫిక్ ను దారి మళ్లిస్తారు.

 హైదరాబాద్ నార్త్(సికింద్రాబాద్)

    - కర్బాల మైదాన్,బుద్ద భవన్ జంక్షన్,షెయిలింగ్ క్లబ్, నల్లగుట్ట జంక్షన్ల వద్ద నుంచి నెక్లెస్ రోడ్డు, అప్పర్ ట్యాంక్ బండ్ వైపు ట్రాఫిక్‌‌‌‌కు అనుమతి లేదు.

 సైబరాబాద్​ పరిధిలో..

గచ్చిబౌలి:  సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 9,10 తేదిల్లో గణేశ్ నిమజ్జనాలు జరగనున్నాయని.. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకు సంబంధించి బుధవారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.    గణేశ్ నిమజ్జనం కోసం వెళ్లే వెహికల్స్ ను  ఫ్లై ఓవర్లపైకి అనుమతించడం లేదని సైబరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు పేర్కొన్నారు. ఫతేనగర్​, సైబర్ టవర్స్​, ఫోరం మాల్​, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ 1, 2, మైండ్​స్పేస్​, రోడ్​ నం.45, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, బాలానగర్​, మల్కంచెరువు, కైత్లాపూర్​, షేక్​పేట్​ ఫ్లై ఓవర్లపైకి అనుమతించట్లేదని తెలిపారు.

ట్రాఫిక్ డైవర్షన్స్..

    - కూకట్ పల్లి  ఐడీఎల్ చెరువు నుంచి రెయిన్ బో విస్టా రూట్ ను క్లోజ్ చేస్తారు. కేవలం గణేశ్ నిమజ్జనానికి వెళ్లే వెహికల్స్ ను మాత్రమే అనుమతిస్తారు.

    - బాలానగర్​, వై జంక్షన్​ నుంచి ఐడీఎల్​ చెరువు మీదుగా మాదాపూర్​, హైటెక్​సిటీ వైపు వెళ్లే వెహికల్స్ కూకట్​పల్లి,  కేపీహెచ్​బీకాలనీ, జేఎన్టీయూ, ఫోరంమాల్​ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

    - హైటెక్​సిటీ, మాదాపూర్ నుంచి కూకట్​పల్లి వై జంక్షన్​ వైపు వెళ్లే వెహికల్స్​ కైత్లాపూర్​, రెయిన్​బో విస్టా, మూసాపేట్​మీదుగా చేరుకోవాలి.

 హస్మత్​పేట్​ చెరువు వద్ద...

    - బోయిన్​పల్లిలోని హస్మత్​పేట్ చెరువు వద్ద గణేష్​విగ్రహాల నిమజ్జనం కోసం సికింద్రాబాద్, బోయిన్​పల్లి, ఇతర కాలనీల నుంచి వచ్చే వెహికల్స్ అంజయ్యనగర్​ మీదుగా చెరువు వద్దకు చేరుకోవాలి. 

    - నిమజ్జనం అయిపోయిన తర్వాత  ఓల్డ్​ బోయిన్​పల్లి, హరిజన బస్తీ మీదుగా వెళ్లాలి.

సూరారం కట్టమైసమ్మ చెరువు వద్ద...

    - బాలానగర్​, జీడిమెట్ల నుంచి బహదూర్​పల్లి, బాచుపల్లి, గండిమైసమ్మ వైపు వెళ్లే వెహికల్స్​సూరారం విలేజ్, బౌరంపేట మీదుగా చేరుకోవాలి.

    - గండిమైసమ్మ నుంచి బాలానగర్​, జీడిమెట్ల వైపు వెళ్లే వెహికల్స్​ బహదూర్​పల్లి జంక్షన్​, దూలపల్లి విలేజ్​, ఐలా జీడిమెట్ల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

 భారీ వెహికల్స్ కు నో ఎంట్రీ

నిమజ్జనం నేపథ్యంలో బీహెచ్ఈఎల్ క్రాస్ రోడ్ నుంచి కూకట్ పల్లి వై జంక్షన్, బాలానగర్ నుంచి ఫతేనగర్ బ్రిడ్జి, వై జంక్షన్ నుంచి ఎర్రగడ్డ రూట్, ఫిరోజ్ గూడ నుంచి వై జంక్షన్ రూట్, గుడెన్ మెట్ నుంచి నర్సాపూర్ క్రాస్ రోడ్, పీవీఎన్ఆర్ నుంచి ఆరాంఘర్ క్రాస్ రోడ్ రూట్లలో భారీ వెహికల్స్ ను అనుమతి ఉండదు. సంగారెడ్డి, పటాన్​చెరు మీదుగా బీహెచ్ఈఎల్​ నుంచి కూకట్​పల్లి మీదుగా సిటీ​ వైపు వెళ్లే బస్సులు, భారీ వెహికల్స్ కు అనుమతి లేదు. బీహెచ్ఈఎల్ నుంచి లింగంపల్లి, హెచ్​సీయూ, గచ్చిబౌలి, టోలిచౌకి మీదుగా సిటీలోకి చేరుకోవాలి. బీహెచ్ఈఎల్, చందానగర్, మియాపూర్ నుంచి అమీర్ పేట​వైపు వెళ్లే భారీ వెహికల్స్ మియాపూర్, బాచుపల్లి, దుండిగల్​మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

మద్యం అమ్మకాలు బంద్

3 కమిషనరేట్ల పరిధిలో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. కల్లు దుకాణాలు, వైన్స్, బార్, లిక్కర్ షాప్ లు బంద్ ఉంటాయని పోలీసులు తెలిపారు.