రేవంత్​రెడ్డి పర్యటనను అడ్డుకుంటం: గణేశ్

రేవంత్​రెడ్డి పర్యటనను అడ్డుకుంటం: గణేశ్

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు :  ఆదిలాబాద్​లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు గణేశ్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని రేవంత్​రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

బోథ్ ​అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వన్నెల అశోక్​ను తొలగించి ఆడె గజేందర్​కు టికెట్​ ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్​ ఆదివాసీలకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ను ఖతం చేయడానికి రేవంత్ ​పూనుకున్నాడని విమర్శించారు.