
- జీఎంలను ఆదేశించిన యాజమాన్యం
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కార్మిక సమస్యల పరిష్కారం కోసం గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలతో నిర్వహించే స్ట్రక్చరల్ మీటింగ్‌లను సింగరేణి యాజమాన్యం బంద్ పెట్టింది. సింగరేణి వ్యాప్తంగా నెలకొన్న ప్రధాన సమస్యలను యాజమాన్యంతో చర్చించి పరిష్కరించుకునేందుకు వీలుగా యాజమాన్యం మూడు నెలలకోసారి కంపెనీ చైర్మన్, మేనేజింగ్డైరెక్టర్స్థాయిలో గుర్తింపు సంఘంతో స్ట్రక్చరల్మీటింగ్నిర్వహిస్తుంది. ఇదే క్రమంలో డైరెక్టర్పా ఆధ్వర్యంలో రెండు నెలలకోసారి నిర్మాణాత్మక మీటింగ్‌ను గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల ప్రతినిధులతో యాజమాన్యం చేపడ్తుంది. కొవిడ్, గుర్తింపు సంఘం కాలపరిమితి గొడవల పేర యాజమాన్యం స్ట్రక్చరల్మీటింగ్లను వాయిదా వేస్తూ వస్తోంది.
ఇప్పుడేమో గుర్తింపు సంఘం ఎన్నికలయ్యేంత వరకు స్ట్రక్చరల్మీటింగ్లు పెట్టవద్దంటూ యాజమాన్యం అనధికారికంగా జీఎంలకు ఆదేశాలివ్వడం గమనార్హం. కార్మికుల సమస్యలపై యాజమాన్యంతో చర్చించాలంటే స్ట్రక్చరల్ మీటింగ్‌లోనే సాధ్యమవుతుంది. స్ట్రక్చరల్ మీటింగ్‌లో మాట్లాడిన ప్రతి విషయం రికార్డు అవుతుంది. దీంతో ఆ సమస్య పరిష్కారం కాకపోతే మరోసారి మీటింగ్‌లో యూనియన్ ప్రతినిధులు యాజమాన్యంపై ఒత్తిడి తీసుకువస్తారు. డైరెక్టర్ పా, ఏరియాల లెవెల్లో చాలా సమస్యలున్నాయని గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. స్ట్రక్చరల్ సమావేశాలు లేకపోవడంతో చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించుకోలేని పరిస్థితి ఏర్పడిందని యూనియన్ల లీడర్లు వాపోతున్నారు. నిన్న మొన్నటివరకు కొవిడ్పేరు చెప్పి మీటింగ్‌లు పెట్టకుండా తప్పించుకున్న యాజమాన్యం, ఇప్పుడేమో ఎన్నికల పేరు చెప్తూ స్ట్రక్చరల్మీటింగ్లను పెట్టకపోవడం దారుణమని గుర్తింపుసంఘమైన టీబీజీకేఎస్ లీడర్లు ఆరోపిస్తున్నారు.
మీటింగ్‌లు పెడ్తాం
కొవిడ్ నేపథ్యంలో స్ట్రక్చరల్ మీటింగ్‌లు ఏర్పాటు చేయడంలో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే. త్వరలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలతో స్ట్రక్చరల్ మీటింగ్‌లు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. మీటింగ్‌లు లేకపోయినా గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు సమస్యలను మా దృష్టికి తీసుకువస్తున్నారు. వీలున్నమేర సమస్యల పరిష్కారానికి యాజమాన్యం కృషి చేస్తోంది. -ఎన్. బలరాం, డైరెక్టర్పా, సింగరేణి
సింగరేణి లెవల్ స్పోర్ట్స్ పోటీలు షురూ
మందమర్రి, వెలుగు: వర్క్పీపుల్ స్పోర్ట్స్‌అండ్ గేమ్స్అసోసియేషన్ ఆధ్వర్యంలో సింగరేణి కంపెనీ లెవల్షటిల్ బాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని సీఈఆర్ క్లబ్లో పోటీలను మందమర్రి ఏరియా సింగరేణి జీఎం చింతల శ్రీనివాస్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ పోటీల్లో రాణించి కోలిండియాలో సింగరేణి క్రీడాకారులు ప్రతిభ చూపాలన్నారు. టేబుల్‌టెన్నిస్ సింగిల్స్ విభాగంలో బెల్లంపల్లి రీజియన్ శ్రీరాంపూర్ఏరియా క్వాలిటీ విభాగం ఆఫీస్ సూపరిండెంటెంట్ఎం.వెంకటేశ్వర్రావు, ఆర్కే5 గని మైనింగ్ సర్దార్కట్ట ఈశ్వరాచారి, మందమర్రి ఏరియా కాసీపేట 2 గని మైనింగ్సర్దార్ పిల్లి వెంకటేశ్వర్లు, భూపాలపల్లి ఏరియా సీనియర్ సూపరింటెండెంట్ఎ.శ్రీనివాస్ సెమీస్‌కు చేరారు.
విమెన్స్ షటిల్ బాడ్మింటన్‌లో ఆర్జీ1 సింగరేణి ఏరియా ఆసుపత్రి స్టాఫ్నర్స్కె.స్వరూప ఫైనల్‌కు చేరింది. కొత్తగూడెం మెయిన్ ఆసుపత్రి సింగరేణి డాక్టర్ శైలజ, ఆర్జీ1 ఏరియా సింగరేణి ఏరియా ఆసుపత్రి స్టాఫ్నర్స్చలం కుమారి సెమీస్‌కు చేరారు. షటిల్ బాడ్మింటన్ వెటరన్ విభాగంలో జనరల్ మజ్దూర్ బాబర్‌పాషా(కొత్తగూడెం ఏరియా), అసిస్టెంట్ చైన్‌మెన్ టి.శంకర్, సెక్యూరిటీ గార్డు పి.సారంగపాణి(భూపాలపల్లి), డాక్టర్ విజయ్‌కుమార్ (కొత్తగూడెం మెయిన్ ఆసుపత్రి) సెమీస్ చేరారు.