ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ నుంచి మ్యాక్స్‌‌‌‌‌‌‌‌వెల్ బ్రేక్

ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ నుంచి మ్యాక్స్‌‌‌‌‌‌‌‌వెల్ బ్రేక్

బెంగళూరు :  ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో నిరాశ పరుస్తున్న  ఆస్ట్రేలియా స్టార్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌‌‌‌‌‌‌‌వెల్ లీగ్‌‌‌‌‌‌‌‌ నుంచి  బ్రేక్ తీసుకున్నాడు. పేలవ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌తో నిరాశ చెంది ఈ నిర్ణయం తీసుకున్నాడు. సోమవారం చిన్నస్వామి స్టేడియంలో సన్‌‌‌‌‌‌‌‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌తో జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో బరిలోకి దిగని మ్యాక్సీ తానే టీమ్‌‌‌‌‌‌‌‌ నుంచి తప్పుకున్నానని వెల్లడించాడు. ‘ఇది చాలా సులువైన నిర్ణయం.

ముంబైతో మ్యాచ్ తర్వాత నా స్థానంలో వేరే ఎవరినైనా ట్రై చేయాలని డుప్లెసిస్‌‌‌‌‌‌‌‌, కోచ్‌‌‌‌‌‌‌‌లకు చెప్పా. నాకిప్పుడు మెంటల్, ఫిజికల్ బ్రేక్ అవసరం. నా బాడీని సరిదిద్దుకోవడానికి నాకు కొంత సమయం కావాలి.  నేను తిరిగి టోర్నీలో బరిలోకి దిగాల్సి వస్తే  ఫిజికల్‌‌‌‌‌‌‌‌గా, మెంటల్‌‌‌‌‌‌‌‌గా బలంగా మారి తిరిగొస్తేనే ఇక్కడ ప్రభావం చూపగలను’ అని మ్యాక్సీ పేర్కొన్నాడు. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో ఆరు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో మూడు సార్లు డకౌటైన అతను 32 రన్స్‌‌‌‌‌‌‌‌ మాత్రమే చేశాడు.