ఎంసెట్ సెంటర్లు మార్చుకున్న 20 వేల మంది స్టూడెంట్లు

ఎంసెట్ సెంటర్లు మార్చుకున్న 20 వేల మంది స్టూడెంట్లు

మొత్తంగా 2, 21, 488 మంది దరఖాస్తు

హైదరాబాద్, వెలుగు: జులై 6 నుంచి ప్రారంభం కానున్న టీఎస్ఎంసెట్ ఎగ్జామ్ కు 20 వేలకు పైగా మంది స్టూడెంట్లు సెంటర్లను మార్చుకున్నారు. వీరిలో తెలంగాణ నుంచి తెలంగాణలోనే 6,093 మంది ఉండగా, తెలంగాణ నుంచి ఏపీకి 3 వేల మంది, ఏపీలోనే వేరే కేంద్రాల్లో రాసేందుకు మరో 11 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో హైదరాబాద్లోని ఐదు జోన్ల మధ్యలోనే ఎక్కువగా సెంటర్లు మార్చుకున్నారు. కరోనా ఎఫెక్ట్ కారణంగా ఈ సారి స్టూడెంట్లకు సెంటర్లు మార్చుకునే అవకాశం ఇచ్చారు. ఈ ఏడాది ఎంసెట్ కు మొత్తం 2,21,488 మంది అప్లయ్ చేసుకున్నారు. ఓ వైపు కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో అసలు ఎంసెట్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారో లేదో అని స్టూడెంట్లలో ఆందోళన మొదలైంది.

For More News..

సీఎం దత్తత గ్రామానికి వారంలో రైతుబంధు

ఆన్ లైన్ క్లాసులపై నో క్లారిటీ.. అయినా ఆపమంటున్న ప్రైవేట్ సంస్థలు

డాడీ.. ఊపిరి ఆడుతలేదు.. ఆక్సిజన్‌‌ తీసేసిన్రు.. ఇక సచ్చిపోతున్న బై..