నారాయణ మెడికల్ కాలేజీలో దారుణం.. లైంగిక వేధింపులతో విద్యార్ధి ఆత్మహత్య 

నారాయణ మెడికల్ కాలేజీలో దారుణం.. లైంగిక వేధింపులతో విద్యార్ధి ఆత్మహత్య 

నారాయణ మెడికల్ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. లైంగిక వేధింపులతో బీడీఎస్ సెకండియర్ చదువుతున్న ప్రదీప్ అనే విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ప్రదీప్. రాహుల్ అనే ఎంబీబీఎస్ స్టూడెంట్ లైంగిక వేధింపులే తన ఆత్మహత్యకు కారణమని సోదరుడికి మెసేజ్ పెట్టాడు ప్రదీప్.తమ బిడ్డ మరణానికి ర్యాగింగే కారణమని తల్లిదండ్రులు అంటున్నారు. రాహుల్ స్వస్థలం అనంతపురం జిల్లా తాడిపత్రి అని సమాచారం.

ప్రదీప్ మరణంతో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మార్చురీ వద్ద నిరసనకు దిగారు ప్రదీప్ బంధువులు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.