పబ్ జీ గేమ్ కు స్టూడెంట్ బలి

పబ్ జీ గేమ్ కు స్టూడెంట్ బలి

పబ్ జీ గేమ్ ఆడొద్దని తల్లి మందలించడంతో ఓ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నిజామాబాద్ నగరంలో మంగళవారం జరిగింది. నగరానికి చెందిన 9 వ తరగతి స్టూడెంట్ ఇంట్లో అదే పనిగా సెల్ ఫోన్ లో పబ్ జీ గేమ్ ఆడుతున్నాడు. సెల్ ఫోన్ పక్కన పడేసి చదువుకోమని మంగళవారం తల్లి మందలించింది. అలిగిన బాలుడు గదిలోకి వెళ్లి తలుపేసుకున్నాడు. ఎంతసేపటికి తీయకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు బద్ధలుకొట్టారు. లోపల ఉరేసుకుని కనిపించాడు. వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు ధ్రువీకరిం చారు.