
కార్తిక స్నానం కోసం వాగులోదిగిన ముగ్గురు విద్యార్ధులు మృతి చెందారు. కార్తీక మాసంలో ప్రతీరోజు ఉదయాన్నే కృత్తికా నక్షత్రం అస్తమించేలోపే నదుల్లో, వాగుల్లో స్నానం చేస్తే జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన రోజని భక్తులు భావిస్తారు. అయితే సిద్ధిపేట జిల్లా కోహెడ్ మండలం వరికోల గ్రామానికి చెందిన కంటె నిఖిల్, కూన ప్రశాంత్, పెందోట వరప్రసాద్ లు ఈ కార్తిక మాస స్నానం ఆచరించేందుకు సమీపంలో ఉన్న వాగులోకి దిగారు. ఆ వాగుల నీటిప్రవాహం అధికంగా ఉండడంతో గుంటలు ఏర్పడ్డాయి. అయితే ఆగుంటుల్ని గుర్తించని యువకులు స్నానమాచరించేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారంతో యువకుల్ని కాపాడేందుకు ఆ ఊరి గ్రామస్థులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే యువకులు నీట మునగడంతో మృత్యువాత పడ్డారు.