
ఈ కాలం విద్యార్థులు మరీ సెన్సిటివ్ గా ఉంటూ చిన్న మందలింపుకే దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మంచి చెప్పినా అర్థం చేసుకోలేని స్థితిలో స్టూడెంట్స్ మైండ్ సెట్ ఉంటోంది. దీంతో ఒక్క మాటకే ఆత్మహత్యలు చేసుకునే వరకు వెళ్లి కన్నోళ్లకు కన్నీళ్లు మిగిలిస్తున్నారు.
శుక్రవారం (ఆగస్టు 01) హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో నైన్త్ క్లాస్ స్టూడెంట్ సూసైడ్ చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. స్కూల్లో జరిగిన పేరెంట్ మీటింగ్ లో విద్యార్థిని చదువు పట్ల శ్రద్ధ వహించాలని మందలించడంతో మనస్థాపానికి గురైన లాస్య ప్రియ (15 ) అనే బాలిక బాత్రూం కిటికీ నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది.
కేపీహెచ్బీ కాలనీ మంజీరా ట్రినిటీ హోమ్స్ 17 వ అంతస్తులో ఉంటున్న హరినారాయణమూర్తి రెండవ కూతురు లాస్య ప్రియ.. స్థానిక అడ్డగుట్ట నారాయణ స్కూల్లో 9వ తరగతి చదువుతోంది. గురువారం జరిగిన టీచర్ పేరెంట్స్ మీటింగ్ లో విద్యార్థిని చదువు పట్ల శ్రద్ధ వహించట్లేదని టీచర్స్ చెప్పడంతో మనస్థాపానికి గురైంది. అప్పటి నుంచి ఒంటరిగా బాధపడుతూ ఉన్న లాస్య ప్రియ.. రాత్రి 9 గంటల సమయంలో ట్రినిటీ హోమ్ 17 అంతస్తు నుంచి దూకీ సూసైడ్ చేసుకుంది.
►ALSO READ | తెలంగాణలో ఆపరేషన్ ముస్కాన్.. 7,678 మంది చిన్నారులను రక్షించిన పోలీసులు
ఇంటిలోని బాత్రూం అద్దాలు తొలగించి ఆ కిటికీ గుండా దూకి ఆత్మహత్య చేసుకుంది. 17 అంతస్తు నుంచి పడిపోవడంతో శరీర భాగం రెండు ముక్కలుగా విడిపోయింది. కాలనీవాసులు గమనించి ఇంట్లో వారికి చెప్పారు. కిందకు వచ్చి చూడగా కూతురు లాస్య శరీరం రెండుగా విడిపోయి ఉండటం చూసి తల్లడిల్లి పోయారు. లాస్య సూసైడ్ చేసుకోవడాన్న చూసి తల్లిదండ్రులు బోరన ఏడ్చారు. విషయం పోలీసులకు తెలపడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు..