కరెంట్ స్తంభం పట్టుకోవడంతో విద్యార్థికి షాక్

కరెంట్ స్తంభం పట్టుకోవడంతో విద్యార్థికి షాక్
  • విద్యార్థి పరిస్థితి విషమం
  • చాదర్ ఘాట్ లో సంఘటన

హైదరాబాద్ : చాదర్ ఘాట్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. అజాం పురా ప్రభుత్వ పాఠశాల నుండి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఐదో తరగతి విద్యార్థి రాకేష్ (13) కు ఊహించని ప్రమాదం జరిగింది. చాదర్ ఘాట్ ఎంజీబీఎస్ స్టేషన్ ప్రధాన రహదారిలోని తుంబే హాస్పిటల్ సమీపంలో కరెంట్ స్తంభాన్ని రాకేశ్ పట్టుకోవడంతో షాక్ కొట్టింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు.. బాలుడిని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు చెప్పారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. వర్షం పడి వెలిసిన పరిస్థితులలో జరిగిన ఈ ప్రమాదం జరిగింది.