మల్లారెడ్డి వర్సిటీ వివరణ ఇవ్వాలి

మల్లారెడ్డి వర్సిటీ వివరణ ఇవ్వాలి
  •     విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతల ఆందోళన

జీడిమెట్ల, వెలుగు : మల్లారెడ్డి యూనివర్సిటీ మేనేజ్ మెంట్ తో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థులు, ఎన్ఎస్​యూఐ విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. ఇటీవల కాలేజీ విద్యార్థికి ప్లేస్​మెంట్​ రాలేదని ఆత్మహత్య చేసుకోవడం, హాస్టల్​ ఫుడ్ లో బొద్దింకలు, బల్లులు రావడంతో శనివారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యంతో విద్యార్థులు తమ జీవితాలను కోల్పోతున్నారన్నారు. 

రూల్స్ కు  విరుద్ధంగా ఫీజులు వసూలు చేయడంతోపాటు సరైన విద్య, భోజన వసతి కల్పించడం లేదని ఆరోపించారు. దీనిపై మల్లారెడ్డి, ఆయన కుమారుడు మహేందర్​రెడ్డి వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్​ చేశారు. దీంతో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. సోమవారం చర్యలు తీసుకునేందుకు మేనేజ్ మెంట్ అంగీకరించడంతో  విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన విరమించారు.