పడవల్లో పాఠశాలకు  విద్యార్థులు 

పడవల్లో పాఠశాలకు  విద్యార్థులు 

అసోంపై వరుణుడు పగబట్టాడు. గత కొద్దిరోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్థంభించిపోయింది. ఎటుచూసినా కనుచూపు మేర వరద నీరే కనిపిస్తుంది. వరదలకు రహదారులు ధ్వంసం అయ్యాయి. పలు గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. కొన్ని గ్రామాల్లో తినడానికి తిండి కూడా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక విద్యార్థుల సంగతి అయితే చెప్పాల్సిన పనిలేదు. పాఠశాలకు వెళ్లాలంటే ప్రతి రోజూ ఫీట్లు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వరదనీరు ఇంకా తగ్గకపోవడంతో పడవలపై ప్రయాణం చేయాల్సి వస్తోంది. థేమాజీ జిల్లాలోని జోనై సబ్ డివిజన్ పరిధిలోని బిష్ణుపూర్  ప్రాంతంలోని గ్రామాల్లోకి వరదనీరు చేరడంతో పడవలపైనే పాఠశాలకు వెళ్తున్నారు. అటు ఉపాధ్యాయులు కూడా స్టూడెంట్స్ తో కలిసి వెళ్లాల్సి వస్తోంది. వానలు, వరదలు ఎప్పుడు తగ్గుముఖం పడతాయా అని స్థానికులు ఎదురుచూస్తున్నారు. సహాయక చర్యలకు వర్షాలు ఆటంకం కలిగిస్తున్నాయని చెబుతున్నారు అధికారులు.

మరిన్ని వార్తల కోసం

ఎమ్మెల్యే బాల్క సుమన్ వేధిస్తుండు

తొలి 5జీ కాల్ చేసిన కేంద్ర మంత్రి