పబ్ జి ఎఫెక్ట్స్ : కత్తులు రాడ్లతో స్కూలుకొచ్చిన స్టూడెంట్స్

పబ్ జి ఎఫెక్ట్స్ : కత్తులు రాడ్లతో స్కూలుకొచ్చిన స్టూడెంట్స్

‘వో పబ్జీవాలా హై క్యా’ అని అప్పట్లో స్టూడెంట్లతో జరిగిన ఓ మీటింగ్‌‌లో ప్రధాని మోడీ అనడం గుర్తుండే ఉంటుంది. అంత ఫేమసైంది ఆ గేమ్‌‌ మన ఇండియాలో. ఇప్పటికీ ఆ గేమ్‌‌ గురించి వార్తల్లో వింటూనే ఉంటాం. ఇట్లనే ఆ గేమ్‌‌ పిచ్చిలో పడి మొరాదాబాద్‌‌లోని కేంద్రీయ విద్యాలయ స్టూడెంట్లు మంగళవారం బడిలోకి కత్తులు, ఇనుప రాడ్లు, చైనీస్‌‌ గన్నులు తీసుకొచ్చారు. వాళ్ల బ్యాగుల్లో ఇవన్నీ కనిపించేసరికి ప్రిన్సిపాల్‌‌ బ్రిజేశ్‌‌ కుమార్‌‌ పట్టుకొని ఆరా తీశారు.  ఏముంది? పబ్జీ ఎఫెక్ట్‌‌ అని తెలిసింది. దీంతో ఆ స్టూడెంట్లను వారం పాటు ప్రిన్సిపాల్‌‌ సస్పెండ్‌‌ చేశారు. వాళ్ల పేరెంట్స్‌‌ను పిలిచి  విషయం చెప్పారు. ఇలాంటిది మళ్లీ రిపీటైతే స్కూల్‌‌ నుంచి పంపించేస్తామని హెచ్చరించారు. పిల్లలంతా 7, 8వ తరగతి వాళ్లని వాళ్ల దగ్గర రాడ్లు, కత్తులు చూసే సరికి ఆశ్చర్యపోయామని బ్రిజేశ్‌‌ అన్నారు.